Student Suicide : ర్యాగింగ్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య

నెల్లూరు ఆర్ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సీనియర్ విద్యార్థుల బెదిరింపులకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెలివెత్తుతున్నాయి.

Student Suicide : ర్యాగింగ్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య

suicide

Student Suicide : నెల్లూరు ఆర్ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సీనియర్ విద్యార్థుల బెదిరింపులకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెలివెత్తుతున్నాయి. అనంత సాగరం మండలానికి చెందిన ప్రదీప్ ఆర్ఎస్ఆర్ కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో కావలి రైల్వే స్టేషన్ సమీపంలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీనియర్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ప్రదీప్ తల్లిదండ్రులు ఆరోపిస్తారు.

ప్రదీప్ ఆత్మహత్య విషయంపై ప్రస్తుతం కాలేజీ యాజమాన్యం ఏ విధంగా స్పందించలేదు. కొద్ది సేపటికి ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డెడ్ బాడీ ఉన్న కావలి ఏరియా హస్పిటల్ కి వెళ్లారు. ప్రదీప్ తల్లిదండ్రులను నిలదీశారు. అనంతరం రాంరెడ్డి ప్రతాప్ కూమార్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.