జీతం సరిపోలేదేమో : రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SI

ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 01:07 PM IST
జీతం సరిపోలేదేమో : రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SI

ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు

ఆయన ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు రుచి మరిగాడు. బెదిరించి, వేధించి మరీ లంచాలు వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి నెల నెల జీతం అందుతున్నా.. ఆ డబ్బు సరిపోలేదో.. ఏమో.. లంచాలు తీసుకుంటున్నాడు. చివరికి పాపం పండి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ఎస్ఐ వెంకటేశ్ రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన పరమేశ్ అనే వ్యక్తి పశువుల సంతను వేలం పాటలో దక్కించుకున్నాడు. తనకు ప్రతి నెల రూ. 8 వేలు లంచం ఇవ్వాలని పరమేశ్‌‌ను తెలకపల్లి ఎస్ఐ వెంకటేశ్ డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరించాడు. 2 నెలలకు గానూ రూ.16 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అంత మొత్తం ఇచ్చుకోలేనని పరమేశ్ బతిమాలాడు. కానీ ఎస్ఐ ఒప్పుకోలేదు. చివరికి రూ.15 వేలు ఇవ్వడానికి పరమేశ్ సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. లంచం విషయంపై ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐకి ఆయన ఇంట్లోనే పరమేశ్ రూ.15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిఘా కెమెరాలు పెట్టి రైడ్ చేశారు. ఎస్ఐని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఎస్ఐ లంచాల బాగోతం గురించి ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.