Nagar Kurnool : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం..క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కూలీలు మృతి

నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. క్రేన్ వైర్ తెగిపడటంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Nagar Kurnool : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం..క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కూలీలు మృతి
ad

Nagar Kurnool  Accident : నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. క్రేన్ వైర్ తెగిపడటంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో భాగంగా క్రేన్ సహాయంతో పలువురు కూలీలు పంప్ హౌస్ లోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపడింది.

Fighter Jet Crash : ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఫైటర్ జెట్.. ఇద్దరు పైలెట్లు మృతి

దీంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కూలీని ఆస్పత్రికి తరలించారు. మృతులు బీహార్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.