Gold Smuggling: కిలోన్నర బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించే ఎయిర్ ఇండియా ఐఎక్స్ 474 విమానంలో పని చేస్తున్నట్లు గుర్తించారు

Gold Smuggling: కిలోన్నర బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది

Gold Smuggling: ఎయిర్ ఇండియా విమాన సంస్థకు చెందిన క్యాబిన్ సిబ్బంది ఒకరు అక్రమంగా బంగారం రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన కేరళలోని కోచి ఎయిర్‌పోర్టులో జరిగింది. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా.

IND VS AUS: అరుదైన రికార్డులకు చేరువలో కోహ్లీ, అశ్విన్.. నాలుగో టెస్టులో సాధ్యమయ్యేనా?

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించే ఎయిర్ ఇండియా ఐఎక్స్ 474 విమానంలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్‌పోర్టులో అప్రమత్తం చేసి, విమానాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా తనకున్న గ్రీన్ ఛానెల్ ద్వారా బంగారాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న షఫీని అదుపులోకి తీసుకున్నారు.

India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

షఫీని తనిఖీ చేయగా, షర్ట్ హ్యాండ్స్ లోపల చేతులకు చుట్టుకుని ఉన్న బంగారాన్ని గుర్తించారు. అతడి దగ్గరి నుంచి 1,487 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు తేల్చారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. వెంటనే షఫీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు చెన్నై ఎయిర్‌పోర్టులో కూడా రూ.3.32 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.