Landlady Murder: 91సార్లు కత్తితో పొడిచి ఇంటి ఓనర్‌ హత్య

నగల కోసం ఇంటి ఓనర్‌ను దారుణంగా హత్య చేశాడు అద్దెకుంటున్న వ్యక్తి. 75 ఏళ్ల వృద్ధురాలిని ఏకంగా 91 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు. మరి పోలీసులకు ఎలా చిక్కాడంటే..

Landlady Murder: 91సార్లు కత్తితో పొడిచి ఇంటి ఓనర్‌ హత్య

Landlady Murder

Updated On : July 25, 2022 / 2:33 PM IST

Landlady Murder: దక్షిణ బెంగళూరులో దారుణం జరిగింది. ఇంట్లో అద్దెకుంటున్న ఒక వ్యక్తి ఓనర్‌ను ఏకంగా 91 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 2న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జై కిషన్ అనే వ్యక్తి దక్షిణ బెంగళూరులోని, వినాయక నగర్‌లో ఒక ఇంట్లో, రెండో ఫ్లోర్‌లో అద్దెకుంటున్నాడు.

Wooden Bridge: కుండపోత వానకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

ఇంటి ఓనర్ యశోదమ్మ వయసు 75. జై కిషన్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అతడికి అనేక అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. వృద్ధురాలైన ఇంటి ఓనర్‌ను చంపి, ఆమె ఒంటిపై ఉండే నగలు తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఈ నెల 2న రాత్రి తొమ్మిదన్నరకు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె నగలు తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో యశోదమ్మ ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉందని తనే ఆమె కొడుక్కి ఫోన్ చేశాడు. ఈలోపు అదే ఇంట్లో అద్దెకుంటున్న మరో వ్యక్తి అంబులెన్స్ పిలిపించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Rishi Sunak: చైనాతో కఠినంగా ఉంటా: బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్

కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎవరికీ జై కిషన్ మీద అనుమానం కలగలేదు. తర్వాత అతడు ఆమె నగలు అమ్మి బ్యాంకు లోన్లు తీర్చేశాడు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు బిల్లు కట్టేశాడు. మరోవైపు పోలీసులు దాదాపు వంద మందిని అనేక కోణాల్లో విచారించారు. అందులో జై కిషన్ గురించి ఎవరికీ అనుమానం కలగలేదు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో ఎలాంటి ఆధారం దొరకలేదు. ఒక దశలో పోలీసులకు ఈ కేసు పరిష్కరిచడం చాలా కష్టంగా మారింది. అయితే, అనేక విచారణల తర్వాత జై కిషన్ లావాదేవీల విషయంలో అనుమానం కలిగింది. ముందుగా అతడు నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స

చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నగల కోసం తనే హత్య చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించారు. మరోవైపు యశోదమ్మ మృతదేహంపై దాదాపు 91 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది.