Niraj Bishnoi : సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్న బుల్లి బాయ్

బుల్లి బాయ్ యాప్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య నీరజ్‌తో కలిపి నాలుగుకు చేరింది. బుల్లి బాయ్ యాప్ ద్వారా చాలా మంది ముస్లిం యువతులు...

Niraj Bishnoi : సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్న బుల్లి బాయ్

Bulli Bai App

Bulli Bai App Case : బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బైష్ణోయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదు. పోలీసు కస్టడీలో ఉన్న అతను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఢిల్లీ పోలీసులు విచారిస్తోన్న సమయంలో రెండు సార్లు తనకు తన గాయపరచుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగుందని పోలీసులు తెలిపారు. అయితే ఇదీ విచారణను మరింత ఆలస్యం చేయడానికేనా అనే అనుమానం కలుగుతుంది.

Read More : Omicron India : భారత్ లో 3,623 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

బుల్లి బాయ్ యాప్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య నీరజ్‌తో కలిపి నాలుగుకు చేరింది. బుల్లి బాయ్ యాప్ ద్వారా చాలా మంది ముస్లిం యువతులు, మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

Read More : Corona Telangana : ఊరెళ్లుతున్న నగర వాసులు..పల్లెల్లో కలవరం, ఎందుకో తెలుసా ?

జనవరి 1న దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసోంలోని దిగంబర్ జొర్హట్‌కు చెందిన నీరజ్ బిష్ణోయ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బుల్లిబాయ్‌ యాప్‌ ఉదంతంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. నీరజ్‌ బిష్ణోయ్‌ చేసిన పనిని చూసి దేశం ముక్కున వేలేసుకుందన్నారు. బీజేపీ వల్లే ఇంత చిన్న వయస్సులో అతడికి అంత ద్వేషం వచ్చిందని ఆరోపించారు రాహుల్‌.