Sonia Gandhi : నేడు మరోసారి ఈడీ ముందుకు సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ రెండో విడత సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఇవాళ ఈడీ విచారణకు సోనియా హాజరుకానున్నందున తదుపరి కార్యాచరణపై ఏఐసీసీ చర్చించింది.

Sonia Gandhi : నేడు మరోసారి ఈడీ ముందుకు సోనియా గాంధీ

Sonia

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ రెండో విడత సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఇవాళ ఈడీ విచారణకు సోనియా హాజరుకానున్నందున తదుపరి కార్యాచరణపై ఏఐసీసీ చర్చించింది. ఏఐసీసీ కార్యాలయంలో ప్రధానకార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు, ఎంపీలు సమావేశమయ్యారు. దేశ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నిర్ణయించారు.

ఈ నెల 21న సోనియాను మూడు గంటల పాటు ఈడీ విచారించింది. అదే రోజు ఈ నెల 26న హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. అయితే సోనియా ఈడీ విచారణ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. అనేక చోట్ల ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించారు. ఇక ఇవాళ మరోసారి హాజరు కాబోతున్నందున దేశ రాజధానిలో టెన్షన్ నెలకొంది.

Sonia Gandhi: మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు

అదనపు డైరెక్టర్‌ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలోని ఐదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నించింది. అంతకుముందు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్….నాలుగు సిట్టింగ్స్‌లో 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరు కాలేకపోయారు.

ప్రస్తుతం వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ పోస్ట్ కోవిడ్‌ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. మరోవైపు సోనియాను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రాజకీయ కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.