Shamshabad : శంషాబాద్‌లో ఫాం హౌస్‌పై పోలీసుల దాడులు

రంగారెడ్డిజిల్లా శంషాబాద్ పోలీసు‌స్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద ఫాంహౌస్‌పై నిన్న రాత్రి పోలీసులు దాడులు చేశారు.

Shamshabad : శంషాబాద్‌లో ఫాం హౌస్‌పై పోలీసుల దాడులు

Shamshabad Cops Seized Hookka Bottles

Shamshabad :  రంగారెడ్డిజిల్లా శంషాబాద్ పోలీసు‌స్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద ఫాంహౌస్‌పై నిన్న రాత్రి పోలీసులు దాడులు చేశారు. నూతన సంవత్సర   వేడుకల పేరుతో ఫాంహౌస్ లో మద్యం, హుక్కా పీల్చుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.

పది హుక్కా బాటిల్స్ సీజ్ చేయడంతో పాటు…. ఏరో స్పేస్ హోటల్‌లో  అనుమతిలేని సౌండ్ సిస్టమ్ (డిజే) సీజ్ చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా గతరాత్రి శంషాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్పెషల్ డ్రైవ్‌లో 92 కేసులు నమోదు చేసినట్లు శంషాబాద్ డిసిసి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

కాగా…. నూతన సంవత్సర వేడుకల సమయంలో హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు..హైదరాబాద్ పోలిస్ కమీషనర్ రేట్ పరిధిలో 1258 కేసులు నమోదు..సైబరాబాద్ పోలీస్ కమీషనర్ రేట్ పరిధిలో 1528 కేసులు నమోదు అయ్యాయి.