Extra Marital Affair : ఆరేళ్లుగా వివాహేతర సంబంధం-జంటగా ఆత్మహత్య

ఆరేళ్లుగా వివాహేతర  సంబంధం  కొనసాగిస్తున్న జంట నిన్న పోచారంప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

10TV Telugu News

Extra Marital Affair :  ఆరేళ్లుగా వివాహేతర  సంబంధం  కొనసాగిస్తున్న జంట నిన్న పోచారంప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.   నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన కత్తుల  సంతోష్ (32) కు కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. అతడికి భార్య స్వప్న, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మెదక్ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ధారవోయిన రాణికి  శెట్టిపల్లి  సంగారెడ్డికి చెందిన వెంకట్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది.  వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  గ్రామానికి కొత్తగా వచ్చిన రాణితో సంతోష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  ఈవ్యవహారం ఆమె భర్తకు తెలియకుండా ఇద్దరూ ఆరేళ్లుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఇద్దరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళారు.
Read Also : Lecturer Suicide : విద్యార్ధిని సూసైడ్ చేసుకున్న వారానికి మ్యాథ్స్ లెక్చరర్ సూసైడ్…కారణం ?
గురువారం ఉదయం పోచారం ప్రాజెక్టులో శవమై తేలారు. ఇద్దరు  కాళ్లకు తాడు, నడుముకు చున్నితో కట్టుకుని జంటగా   ప్రాజెక్టులో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు మృతదేహాలను చూస్తే తెలుస్తోంది. వీరి మరణానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

 

×