కోడలిపై పాశవిక దాడి : భూతవైద్యం పేరుతో 101 కత్తిపోట్లు

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 09:13 AM IST
కోడలిపై పాశవిక దాడి : భూతవైద్యం పేరుతో 101 కత్తిపోట్లు

భూత వైద్యం చేస్తానంటూ వదినపై ఆడబిడ్డ చేసిన అరాచకం..అఘాయిత్యం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది. భూతవైద్యం పేరుతో సోదరుడి భార్యపై భయంకరమైన హింసకు పాల్పడింది ఆడపడుచు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు నడిరోడ్డుపై అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ఆస్పిటల్ లో చేర్చించటంతో బతికి బైటపడింది.  

వివరాల్లోకి వెళితే..బరేలి జిల్లాలోని బరదార్‌ ప్రాంతంలో సంజయ్‌ భార్య రేణుక పాటు తన  కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఈ క్రమంలో సంజయ్ తండ్రి జగదీష్ కు అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా తండ్రి అనారోగ్యం నయం చేయటానికి చెల్లెలు మోనీ  భూతవైద్యం నేర్చుకుంది. ఆ విద్య తనకు పూర్తిగా వచ్చిందో లేదోనని చెక్ చేసుకోవాలనుకుంది. తండ్రిపై ప్రయోగిస్తే చచ్చిపోతేడేమో అనుకుంది. దీనికి  ఏం చేయాలా? అని ఆలోచించింది. ఇంట్లో వదినపై ప్రయోగిద్దాం అనుకుంది. వెంటనే పనిలో దిగిపోయింది. 

దీనికి అన్న సంజయ్, తండ్రి జగదీష్ సహకరించారు. వదిన రేణుకను పాశవికంగా హింసించింది. రేణుక ముఖంపైనా ఛాతీ పైనా ఇంకా ఇతర శరీర భాగాలపై కత్తి గాట్లు పెట్టింది. ఆ బాధకు రేణు విలవిల్లాడిపోయేది.బాధ తట్టుకోలేక పెద్ద పెద్దగా అరిచేది. ఆమె అరుపులు చుట్టుపక్కల వారు వినకుండా రేణుక నోరు నొక్కేసేవారు ముగ్గురు కలిసి. అలా రేణు శరీరంపై మోనీ 101 కత్తిగాట్లు పెట్టింది. శరీరం అంతా రక్తస్రావం..భరించలేని బాధతో రేణుపై ఘోరమైన హింసకు పాల్పడ్డారు కుటుంబ సభ్యులంతా. 

అలా ఆ హింసలు భరించే శక్తి కోల్పోయింది రేణుక. వారి నుంచి తప్పించుకోవాలనుకుంది. అదను చూసి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పారిపోయింది. అలా బైటకు వెళ్లిందిగానీ..ఒళ్లంతా తీవ్రమైన కత్తిపోట్టు సలిపేస్తుంటే బాధ తాళలేక నడిరోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది. అలా పడిపోయిన రేణుకను ఆ దారిగుండా వస్తున్న పెట్రోలింగ్ పోలీసులు చూశారు. ఒళ్లంతా గాయాలతో ఉన్న ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించారు.  

ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. వెంటనే చికిత్సలో భాగంగా..ఆమె గాయాలకు 300ల కుట్లు వేసామని ఆమె పూర్తిగా కోలుకోవటానికి చాలా కాలం పడుతుందని డాక్టర్లు తెలిపారు. ఆమె కొద్దిగా కోలుకున్నాక వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేణుక చెప్పిన వివరాలతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  
 
ఈ ఘటన గురించి ఎస్సై నరేష్‌ త్యాగీ మాట్లాడుతూ..బరేలీ గ్రామానికి చెందిన రేణుకు ఎనిమిదేళ్ల క్రితం సంజయ్‌తో వివాహం జరిగిందనీ ఇంట్లో ఆడపడుచు రేణుకను భూతవైద్యం పేరుతో పాశవిక దాడికి యత్నించిందని రేణుకు ఫిర్యదుతోఐపీసీ సెక‌్షన్‌ 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసి రేణుక ఆడబడుచు మోనిని గురువారం (జనవరి 9,2020) అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె చేసిన అరాచకానికి సహకరించిన సంజయ్ ను అతని తండ్రి జగదీష్ లు పరారయ్యారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రేణుకకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.