Gujarat: క్రికెట్ ఆడుతుండగా బంతి తీసుకున్నాడని దళిత వ్యక్తి బొటనవేలు నరికారు

ఆదివారం జిల్లాలోని కకోషి గ్రామంలో స్థానిక పాఠశాల ప్లేగ్రౌండ్‌లో కొంత మంది క్రికెట్ ఆడుతుండగా ఒక పిల్లాడు (దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) బంతి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ తీవ్రంగా బెదిరించారు. అతడిపై సామాజికపరమైన దూషణలు తీవ్రంగా చేశారు

Gujarat: క్రికెట్ ఆడుతుండగా బంతి తీసుకున్నాడని దళిత వ్యక్తి బొటనవేలు నరికారు

Thumb Chopped Off: మహాభారతంలో ఏకలవ్యుడి బొటనవేలుని ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తీసుకోవడంపై ఆధునిక భారతంలో అనేక విమర్శలు నేటికీ వినబడుతూనే ఉంటాయి. సామాజికపరమైన అంతరాల కారణంగానే వివక్షతో ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఇక్కడ గురుశిష్యుల ఒప్పందం కాదు కానీ, కొంత మంది మధ్య వాగ్వాదం వల్ల జరిగింది. క్రికెట్ ఆడుతుండగా బాల్ (బంతి) తీసుకెళ్లాడని ఒక దళిత వ్యక్తి బొటనవేలు నరికేశారు.

Apple WWDC 2023 Event : హెల్త్ ఫీచర్లపైనే ఆపిల్ ఫోకస్.. ఈ సరికొత్త ఫీచర్లతో మానసిక ఆరోగ్యాన్ని మానిటర్ చేయొచ్చు..!

రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో జరిగిన దారుణం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం జిల్లాలోని కకోషి గ్రామంలో స్థానిక పాఠశాల ప్లేగ్రౌండ్‌లో కొంత మంది క్రికెట్ ఆడుతుండగా ఒక పిల్లాడు (దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) బంతి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ తీవ్రంగా బెదిరించారు. అతడిపై సామాజికపరమైన దూషణలు తీవ్రంగా చేశారు. అయితే వారి మాటలు, బెదిరింపులు, తిట్లపై బాలుడి మేనమామ ధీరజ్ పర్మార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పటికైతే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Karnataka Politics: ఆవుల్ని వధిస్తే తప్పేంటని వ్యాఖ్యానించి మంత్రి వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య రియాక్షన్ ఏంటంటే?

అయితే, అదే రోజు సాయంత్రం పదునైన ఆయుధాలతో ఏడుగురితో కూడిన బృందం ధీరజ్ ఇంటి వద్దకు వచ్చి ధీరజ్ మీద, అతని సోదరుడు కీర్తిపై దారుణంగా దాడికి దిగారు. అందులో ఒకరు కీర్తి బొటనవేలు నరికి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు తెలిపారు. కాగా నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 326 (ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్ఛందంగా తీవ్రంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు)తో పాటు SC-ST (అట్రాసిటీల నిరోధక చట్టం)లోని ఇతర సంబంధిత నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.