Woman teacher burnt alive: రాజస్తాన్‭లో మరో దారుణం.. అందరి ముందే దళిత టీచర్‭కు నిప్పు.. వారమైనా కేసు కూడా తీసుకోని పోలీసులు

నేరస్తులకు ఆమె కొంత డబ్బు ఇచ్చింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆమె వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. ఆమెను తరుచూ కొట్టేవారట. దుర్భషలాడేవారట. దీంతో తన డబ్బు కోసం మే 7న ఆమె కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ దారుణం జరిగింది. 70 శాతం కాలిన ఆమెను జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఏడు రోజులు పాటు పోరాడి ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి రిపోర్టులు పేర్కొన్నాయి

Woman teacher burnt alive: రాజస్తాన్‭లో మరో దారుణం.. అందరి ముందే దళిత టీచర్‭కు నిప్పు.. వారమైనా కేసు కూడా తీసుకోని పోలీసులు

Dalit woman teacher burnt alive no arrest even after 7 days of incident

Woman teacher burnt alive: 9 ఏళ్ల చిన్నారి మరణం రాజస్తాన్ రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. ఈ తరుణంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా దళిత టీచర్‭కు కొంత మంది పబ్లిక్ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దారుణం జరిగింది ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు. రాజస్తాన్ రాజధాని జైపూర్ నడిబొడ్డున వెలుగు చూసిందీ అమానుషం. మహిళ తన కొడుకుతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా నేరస్తులు ఆమెకు నిప్పంటించారు.

అయితే ఈ ఘటన జరిగి వారమైనా పోలీసులు కనీసం కేసు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వారం క్రితం నుంచి సర్కులేట్ అవుతున్నాయి. తనపై దాడి జరిగిన సమయంలో మహిళ ఒక ఇంట్లోకి పరుగెత్తింది. అనంతరం 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోకపోగా.. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుంటే స్థానికులు ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉన్నారే కానీ ఆమె ఎంతగా కేకలు పెట్టినా ఎవరూ సహాయం చేయలేదు.

ఒక కథనం ప్రకారం.. నేరస్తులకు ఆమె కొంత డబ్బు ఇచ్చింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆమె వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. ఆమెను తరుచూ కొట్టేవారట. దుర్భషలాడేవారట. దీంతో తన డబ్బు కోసం మే 7న ఆమె కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ దారుణం జరిగింది. 70 శాతం కాలిన ఆమెను జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఏడు రోజులు పాటు పోరాడి ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి రిపోర్టులు పేర్కొన్నాయి. కొందరు పోలీసులు నేరస్తులతో కుమ్మక్కయ్యారని, అందుకే ఈ విషయంలో కనీసం కేసు కూడా తీసుకోలేదని తెలుస్తోంది.

ఈ ఘటనపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కు సబంధించిన వీడియోను షేర్ చేస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. రాజస్తాన్ లో పరిస్థితి మరింత తీవ్రమవుతోందని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఎంత మాత్రం చలనం లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Nitish-Tejashwi cabinet: బిహార్ మంత్రుల్లో 72% మందిపై క్రిమినల్ కేసులు: రిపోర్ట్