Labour Died: లీవ్ ఇవ్వలేదని వెళ్లిపోయిన లేబర్లు.. నదిలో మునిగి ఒకరు మృతి

పండుగ సందర్భంగా కాంట్రాక్టర్ లీవ్ ఇవ్వకపోవడంతో పని మధ్యలోనే వదిలేసి ఇళ్లకు బయల్దేరారు 19 మంది కార్మికులు. వీరిలో ఒక కార్మికుడు నదిలో పడి మరణించాడు. మిగతా వారి ఆచూకీ ఇంకా దొరకలేదు.

Labour Died: లీవ్ ఇవ్వలేదని వెళ్లిపోయిన లేబర్లు.. నదిలో మునిగి ఒకరు మృతి

Labour Died

Labour Died: కాంట్రాక్టర్ లీవ్ ఇవ్వకపోవడంతో పని మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు 19 మంది లేబర్లు. అయితే వారిలో ఒకరి మృతదేహం దగ్గర్లో ఉన్న నదిలో కనిపించింది. మరో 18 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ఘటన ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో జరిగింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)లో భాగంగా దేశ సరిహద్దుల్లో రోడ్లు నిర్మిస్తోంది కేంద్రం. అత్యవసర పరిస్థితుల్లో సైన్యాన్ని, యుద్ధ సామగ్రిని సరిహద్దులకు సులభంగా చేర్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

దీనిలో భాగంగా భారత్-చైనా సరిహద్దులోని డామిన్-హురి ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇది అటవీ ప్రాంతం. పక్కనే కుమే నది ప్రవహిస్తూ ఉంటుంది. రవాణా సదుపాయం చాలా తక్కువ. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి 19 మంది కార్మికులు ఇక్కడ కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. ఈద్ సందర్భంగా సెలవు కావాలని కార్మికులు ఈ నెల 5న కాంట్రాక్టర్‌ను అడిగారు. దీనికి కాంట్రాక్టర్ నిరాకరించాడు. దీంతో వాళ్లంతా పని మధ్యలోనే వదిలేసి ఎలాగైనా ఇండ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా ఎవరికి తోచిన దారిలో వాళ్లు వెళ్లిపోయారు. అటవీ ప్రాంతం గుండా కొందరు, నది దగ్గర నుంచి ఇంకొందరు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఒక కార్మికుడు నదిలో పడి మరణించాడు. అతడి మృతదేహాన్ని అధికారులు నదిలో ఇటీవల గుర్తించారు.

African Grey Parrot: కనిపించకుండా పోయిన చిలుక.. కనిపెడితే రూ.50 వేల బహుమతి

మిగతావారి సంగతి ఇంకా తేలలేదు. మరోవైపు 16 మంది మృతదేహాలు నదిలో తేలియాడటం గుర్తించినట్లు ఈ ప్రాంతంలో ఒక ఆడియో వైరల్ అయింది. అయితే, అధికారులు దీన్ని కొట్టిపారేశారు. ఈ ప్రాంతం కొలోరియాంగ్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. నదీ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాలని, కార్మికులు నిజంగానే నదిలో మునిగిపోయారా లేదా తేల్చాలని అధికారులు సర్కిల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. కనిపించకుండా పోయిన మిగతా కార్మికుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. కార్మికులంతా అసోంకు చెందిన వాళ్లే.