DRDO : హానీ ట్రాప్‌‌లో సంచలన విషయాలు, ఎలా ట్రాప్ చేసిందో తెలుసా ?

ఒకరికి తెలియకుండా ఒకరితో పరిచయం చేసుకుంది. ఫేస్‌బుక్, వాట్సప్‌, వీడియోకాల్స్‌తో స్నేహం పెంచుకుంది. తియ్యని మాటలు చెప్పింది. పెళ్లిచేసుకుంటాననీ నమ్మించింది. డబ్బులు కూడా ఇచ్చింది.

DRDO : హానీ ట్రాప్‌‌లో సంచలన విషయాలు, ఎలా ట్రాప్ చేసిందో తెలుసా ?

Drdo

DRDO Espionage Case : ఒకరికి తెలియకుండా ఒకరితో పరిచయం చేసుకుంది. ఫేస్‌బుక్, వాట్సప్‌, వీడియోకాల్స్‌తో స్నేహం పెంచుకుంది. తియ్యని మాటలు చెప్పింది. పెళ్లిచేసుకుంటాననీ నమ్మించింది. డబ్బులు కూడా ఇచ్చింది. అలా మొత్తం ఐదుగురి నుంచీ దేశ రహస్య సమాచారం రాబట్టింది. ఒడిశా చాందీపూర్‌ DRDO హనీట్రాప్‌ కేసులో జరిగింది ఇదే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసుపై కటక్ క్రైం బ్రాంచ్ అధికారులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ విస్తృత దర్యాప్తు చేస్తున్నాయి.DRDOలో హనీ ట్రాప్ జరిగినట్టు గుర్తించిన బాలాసోర్ పోలీసులు వారం రోజుల క్రితం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Read More : Intelligence Bureau : దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. పసిగట్టిన నిఘా వర్గాలు

వారంతా DRDO ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్‌లో శాస్త్రవేత్తలు. మిస్సైల్ టెస్టింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు కటక్ క్రైం బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఐదుగురు నిందితుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.ఆ ఐదుగురుతో ఒక మహిళ పరిచయం పెంచుకుంది. ఒకరికి తెలియకుండా ఒకరితో తన వివరాలను ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా చెప్పింది. రాజస్థాన్‌ మీడియాలో పనిచేస్తున్నానని ఒకరికి, ఇంగ్లండ్‌లో ఉంటానని, క్షిపణులంటే ఆసక్తి అని మరొకరికి, పోర్ట్‌ బ్లెయిర్‌లో నర్సుగా పనిచేస్తున్నాని ఒక శాస్త్రవేత్తకి, చండీగర్‌లో ఆర్మీలో కిందిస్థాయి క్లర్క్‌గా పనిచేస్తున్నానని మరొకరికి అబద్ధాలు చెప్పి..వారిని బుట్టలో వేసుకుంది. నెమ్మదిగా వారి నుంచి రహస్యాలు సేకరించడం మొదలుపెట్టింది.

Read More : Maha Samudram Trailer : మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..

మహిళ మోసం గ్రహించలేని DRDO సిబ్బంది…ఆమె ట్రాప్‌లో చిక్కుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె కోరిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఇంగ్లీష్, హిందీల్లో చాట్ చేసేదని…తమను పెళ్లిచేసుకుంటామని కూడా చెప్పిందని…నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. అంతేకాదు..నిందితుల్లో ఒకరి ఖాతాకు దుబాయ్ నుంచి 35వేలు రెండు విడతలుగా బదిలీ అయినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. బ్రిటన్‌ ఫోన్ నంబరు నుంచి మహిళ మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు ఆమెను గుర్తించేందుకు ఆ దేశ అధికారుల సాయం కోరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా నిందితులను ప్రశ్నించనుంది. హనీట్రాప్ వెనక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల దేశంలో వరుసగా హనీట్రాప్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఉన్నత విద్య అభ్యసించి…శాస్త్రవేత్తలుగా ఎదిగిన వ్యక్తులు…మహిళలు, యువతుల ఉచ్చులో చిక్కుకుని..రక్షణ సంబంధ రహస్యాలను వెల్లడిస్తున్నారు. ఇది దేశభద్రతకు ప్రమాదంగా మారుతోంది.