Data Theft Case : డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. సైబరాబాద్ లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు

వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

Data Theft Case : డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. సైబరాబాద్ లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు

Enforcement Directorate

Data Theft Case : వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. రక్షణ రంగానికి చెందిన పలువురు అధికారుల ఈ-మెయిల్, ఇతర వివరాలు సైతం ఉన్నట్లు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు కోసం ఇచ్చిన డేటాను లీక్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

దేశవ్యాప్తంగా దాదాపు 16.8 మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన కేసులో గతంలో సైబారాబాద్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఈడీ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్) కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పీఎమ్ ఎల్ ఏ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.  రక్షణ రంగానికి చెందిన పలువురు అధికారుల ఈ-మెయిల్స్ ద్వారా వారి వ్యక్తిగత వివరాలను దొంగిలించినట్లు కొన్ని ఆధారాలు సేకరించారు. దీతో పాటు బ్యాంక్ కార్డు, క్రెబిట్ కార్డు, పాన్ కార్డు ద్వారా డేటాను లీక్ చేసినట్టు గుర్తించారు.

డేటా లీక్ కేసు.. ఐటీ గ్రిడ్ కథ ఏంటి?

డేటా చోరీ కేసులో ఈడీ రంగంలోకి దిగిన నేపథ్యంలో కీలక అధారాలు బయట పడే అవకాశాలు ఉన్నాయి. 2023 మార్చి23న హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేసింది. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ కార్డు వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక కోట్లాది మంది వ్యక్తిగత డేటాను పోలీసులు రీకవరీ చేశారు.

వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ఏడుగురిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కోట్ల మంది డేటాను అంతరాష్ట్ర ముఠా చోరీ చేసిందని వెల్లడించారు. ఇన్సూరెన్స్, లోన్స్ కోసం అప్లై చేసిన 4 లక్షల మంది డేటా, 7 లక్షల ఫేస్ బుక్ యూజర్స్ డేటా చోరీ చేశారని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారని వెల్లడించారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Nallamothu Sridhar : డేటా చోరీ అంటే ఏమిటి? ఏ విధంగా తస్కరిస్తారు? పర్సనల్ డేటాను కాపాడుకోవడం ఎలా?

ఢిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటాను కూడా అమ్మకానికి పెట్టారని సైబరాబాద్ సీపీ పేర్కొన్నారు. మహిళలకు చెందిన వ్యక్తిగత వివరాలను సైతం చోరీ చేశారని పేర్కొన్నారు. ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ కోసం ఒక ఏజెన్సీని పెట్టుకున్నామని తెలిపినట్లు వెల్లడించారు. ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటాను అమ్ముకున్నాడని పేర్కొన్నారు. జస్ట్ డయల్ మీద కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.