Enforcement Directorate : హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం..ఒకేసారి 8 చోట్ల సోదాలు

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. బుధవారం (జులై27,2022) ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్‌, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

Enforcement Directorate : హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం..ఒకేసారి 8 చోట్ల సోదాలు

Ed

Enforcement Directorate : హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. బుధవారం (జులై27,2022) ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్‌, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. విదేశాలకు నిధులు మళ్లించినట్లు వీరిద్దరిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి, ఐఎస్‌ సదన్‌లోని చీకొటి ప్రవీణ్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మాధవరెడ్డి, చీకొటి ప్రవీణ్‌ నేపాల్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమర్లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు తరలించి.. అటునుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించారు.

Sonia Gandhi: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. ఒకేవిధంగా సమాధానమిచ్చిన రాహుల్, సోనియా!

శ్రీలంకలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌, నేపాల్‌లో క్యాసినో నిర్వహించి, ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించారు. వారం రోజులపాలు అక్కడే ఉండి క్యాసినో ఆడేందుకు ఒక్కో కస్టమర్ నుంచి రూ.3 లక్షల రూపాయలు వసూలు చేశారని, 4 రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిఫ్‌లు సైతం అందించారు. నేపాల్‌తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్‌లు నిర్వహించినట్లు తేలింది. దీంతో ఫెమా నిబంధనల కింద ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, గుడివాడతోపాటు హైదరాబాద్‌ క్యాసినో ఆడిస్తూ చికోటి ప్రవీణ్‌ గతంలో పట్టుబడ్డాడు.