Sonia Gandhi: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. ఒకేవిధంగా సమాధానమిచ్చిన రాహుల్, సోనియా!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రాహుల్ విచారణ సమయంలో ఇచ్చిన సమాధానాలనే సోనియాగాంధీ సైతం తనను విచారించిన సమయంలో తెలిపినట్లు తెలిసింది.

Sonia Gandhi: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. ఒకేవిధంగా సమాధానమిచ్చిన రాహుల్, సోనియా!

Congress new president

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. ఈనెల 21న విచారణ సందర్భంగా మూడు గంటల పాటు సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు, మంగళవారం(26న) ఆరు గంటలు, బుధవారం(27న) రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా రాహుల్ గాంధీ చెప్పిన విషయాలనే సోనియాగాంధీ ఈడీకి తెలిపినట్లు తెలుస్తోంది. మొదటి రెండు రోజుల విచారణలో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Sonia Gandhi: ఈడీ విచారణకు సోనియా మూడో రోజు

ఆర్థిక సంబంధిత వ్యవహారాలన్నీ దివంగత మోతీలాల్ వోరా నిర్వహించారని సోనియా ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వోరా 2020లో మరణించారు. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా ఎక్కువ కాలం పనిచేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .. రాహుల్ గాంధీని ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు అన్ని లావాదేవీలను వోరా నిర్వహించారని అధికారులకు వివరించారు. రాహుల్, సోనియాతో పాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, పవన్ కుమార్ బన్సాల్ కూడా ఇదే పేరును ఈడీ అధికారులు వెల్లడించినట్లు తెలిసింది.

Sonia Gandhi: మొదటిరోజు ముగిసిన సోనియా గాంధీ విచారణ.. మళ్లీ సోమవారం హాజరుకావాలన్న ఈడీ

యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వ్యక్తిగత లాభాలకు సంబంధించిన ప్రశ్నలపై జూన్ నెలలో రాహుల్ సమాధానమిస్తూ.. యంగ్ ఇండియన్ కంపెనీ లాభాపేక్ష లేని కంపెనీ అని, ప్రత్యేక నిబంధనల ప్రకారం కంపెనీల చట్టం కింద విలీనం చేయబడిందని, దాని నుండి ఒక్క పైసా కూడా తీసుకోలేదని రాహుల్ ఈడీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. రెండు రోజుల విచారణలో 8 గంటలకు పైగా సోనియా గాంధీని ప్రశ్నించగా.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ పాత్ర గురించి, ఈ కంపెనీ ద్వారా ఎవరైనా ఏదైనా ద్రవ్య లాభం పొందారా అని అడిగినప్పుడు ఈడీకి రాహుల్ తెలిపిన సమాధానమే సోనియా గాంధీ ఇచ్చినట్లు తెలిసింది.  ఇదిలాఉంటే బుధవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఈడీ అధికారులు సోనియాను ప్రశ్నించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో భోజన విరామం ఇచ్చిన అధికారులు తొలుత మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ రావాలని సోనియాకు తెలిపారు. కానీ తర్వాత మళ్లీ విచారణ ముగిసిందని ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు చెప్పినట్లు తెలిసింది.