Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

సిమెంట్ లోడ్ తో వేగంగా వెళ్తోన్న లారీ తుర్కయంజాల్ కూడలి వద్ద డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Road Accident (2)

Updated On : May 16, 2023 / 10:29 AM IST

Ranga Reddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సిమెంట్ లోడ్ తో వేగంగా వెళ్తోన్న లారీ తుర్కయంజాల్ కూడలి వద్ద డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Mexico Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ – వ్యాన్ ఢీ, 26 మంది మృతి

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.