Pakistan Bomb Blast : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, ఇద్దరు పోలీసులతో సహా పలువురు మృతి

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Pakistan Bomb Blast : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, ఇద్దరు పోలీసులతో సహా పలువురు మృతి

Pakistan Bomb Blast

Pakistan Bomb Blast : పాకిస్థాన్ లో మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా నలుగురు మృతి చెందారు. పాక్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని కవెట్టాలోని షహ్రా-ఎ-ఇక్బాల్ ప్రాంతంలో సోమవారం (ఏప్రిల్ 10,2023) సంభవించిన బాంబు పేలుడు నలుగురు మృతి చెందగా మారో 18మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు ధాటికి పోలీసు వాహనాలతో పాటు వాటి చుట్టు పార్కింగ్ చేసిన ఉన్న కార్లు, మోటార్ బైకులో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో ఓ బాలిక కూడా మృతి చెందింది.

2023 ఫిబ్రవరి 5 పాకిస్థాన్ లోని క్వెట్టాలో పేలుడు సంబవించి 100కిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయడపడ్డారు. అలాగే పెషావర్ నగరంలో జరిగిన పేలుళ్లలో కూడా 100మంది చనిపోయారు. ఇలా పాకిస్థానల్ బాంబు పేలుళ్లు,మానవబాంబుల దురాగతాలు సర్వసాధారణంగా మారిపోయాయి. పలువురు ప్రాణాలు తీస్తున్నాయి. అమాయక ప్రజలు ఈ దురాగతాలకు ప్రాణలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలు విషాదాల్లో మునిగిపోతున్నాయి. అయినవారిని కోల్పోయి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. పలు సందర్భాల్లో ఇటువంటి పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబ సభ్యులు అనాథలుగా మారిపోతున్న దుస్థితులు నెలకొంటున్నాయి.