Road Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న నాలుగు వాహనాలు, మూడు వెహికిల్స్ దగ్ధం

ఓ లారీ కొత్తగూడెం వైపు వెళ్తోంది. కొంతమంది మద్యం సేవించి ఎదురుగా రోడ్డుపై కారు నిలిపారు. లారీ డ్రైవర్ అక్కడి వెళ్లి కారును తొలగించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది.

Road Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న నాలుగు వాహనాలు, మూడు వెహికిల్స్ దగ్ధం

Bhadradri Kothagudem Road Accident

Updated On : July 22, 2023 / 7:50 AM IST

Four Vehicles Collided : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జూలూరుపాడు శివారులో ఖమ్మం – కొత్తగూడెం రహదారిపై నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. రోడ్డుపై ఆపిన లారీని వెనకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కున్నాడు.

అతన్ని రక్షించేందుకు మరో లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి అటువైపుకు వెళ్లాడు. వెంటనే నిలిపి ఉన్న ఆ లారీని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది.

Shamirpet ORR Road Accident : శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓ లారీ కొత్తగూడెం వైపు వెళ్తోంది. కొంతమంది మద్యం సేవించి ఎదురుగా రోడ్డుపై కారు నిలిపారు. లారీ డ్రైవర్ అక్కడి వెళ్లి కారును తొలగించాలని కోరుతున్నాడు.

ఈ క్రమంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. అశోక్ లే ల్యాండ్ కు సంబంధించిన లారీ డ్రైవర్ ఢీకొట్టడంతో మరో లారీలో ఉన్న డ్రైవర్ తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.