Shamirpet ORR Road Accident : శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రమాదం ధాటికి లారీ, కారు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

Shamirpet Road Accident
Three Spot Dead : హైదరాబాద్ శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి కారుతోపాటు మరో వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో క్లీనర్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మేడ్చల్ నుంచి కీసర వెళ్తున్న లారీ వాహనాలను ఢీకొని చెట్ల పొదలోక్కి దూసుకెళ్లింది.
Medchal Road Accident : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
ప్రమాదం ధాటికి లారీ, కారు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మూడు మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో ఓఆర్ఆర్ పై వాహనాల పోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.