Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

Road Accident: వేగంగా వచ్చిన డంపర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతే, ఒక్కసారిగా ఆటోలో ఉన్న ప్రయాణికులు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

Road Accident(Photo : Google)

Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, డంపర్ (భారీ వాహనం) ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు చనిపోయారు. 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కైసర్ గంజ్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో 20మంది వరకు ఉన్నారు. ఆటో కిక్కిరిసిపోయి ఉంది. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఎదురుగా భారీ వాహనం (డంపర్) వచ్చింది. ఆ వాహనాన్ని చూడగానే ఆటోడ్రైవర్ కాస్త సైడ్ ఇచ్చాడు. కానీ, అతడిచ్చిన సైడ్ సరిపోలేదు. భారీ వాహనం కావడంతో డంపర్ ఆటోను గుద్దేసింది.

Also Read..GPS Car : OMG.. ప్రాణాలకు మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో

వేగంగా వచ్చిన డంపర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతే, ఒక్కసారిగా ఆటోలో ఉన్న ప్రయాణికులు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్ర గాయాలతో స్పాట్ లోనే ఐదు మంది మరణించారు. ఈ యాక్సిడెంట్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆటోని డంపర్ ఢీకొన్న తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కాగా, ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంత చిన్న ఆటోలో 20మంది ఉండటం దారుణం అంటున్నారు.

హుజూర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురైని గ్రామానికి చెందిన మన్షారామ్ ఇంట్లో పెళ్లికి సంబంధించిన వేడుక జరిగింది. ఈ వేడుకకు బంధువులు హాజరయ్యారు. వేడుక ముగిశాక అర్థరాత్రి 1గంట సమయంలో వారంతా తమ గ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో హూజూర్ పూర్ రోడ్డులోని మదానీ ఆసుపత్రి సమీపంలో డంపర్ ఢీకొట్టింది.

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

ఆ ప్రాంతం రక్తమోడింది. మృతదేహాలతో, క్షతగాత్రులతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. తీవ్ర గాయాలతో బాధితులు ఆర్తనాదాలు పెట్టారు. కాగా, యాక్సిడెంట్ తర్వాత డంపర్ డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలే అర్థరాత్రి, ఆటోలో 20మంది, దానికి తోడు మితిమీరిన వేగం.. ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయని పోలీసులు చెబుతున్నారు.