ఆ అనుమానంతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో...కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో

  • Edited By: veegamteam , January 31, 2020 / 10:21 AM IST
ఆ అనుమానంతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో…కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో

అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో…కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. అగ్ని సాక్షిగా కలకలం తోడుంటానని మాటిచ్చి.. మధ్యలోనే భార్యలను అంతమొందిస్తున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు…పిల్లల భవిష్యత్‌ ను ప్రశ్నార్ధకంగా మార్చుతున్నారు. 

ప్రస్తుత సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. భార్యా భర్తల మధ్య ప్రేమాను బంధాలు, మమతానురాగాలు శిథిలమవుతున్నాయి. కలహాలే కలిసి కాపురం చేస్తున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య అనుమానం చిచ్చు రేపుతోంది. చివరికి వారి ప్రాణాల్ని బలితీసుకుంటుంది. తాజాగా అనుమానంతో ఓ వ్యక్తి భార్యను అంతం చేసి…అభంశుభం తెలియని చిన్నారిని గాయపరిచాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తండ్రి చేసిన దాడిలో గాయపడిన ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది.

నాంపల్లి మండలం రాందాస్‌ తండాకు చెందిన మధుకు, పెద్దఅడిశర్లపల్లి మండలం చింతకుంట్లతండాకు చెందిన అఖిలతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 18 నెలల కూతురు ఉంది. మధు వృత్తిరీత్యా బోరుబండిపై పనిచేసేవాడు. కొంత కాలం భార్యను కంటికి రెప్పలా చూసుకున్న మధు..ఇటీవల అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో తరచూ ఆమెతో గొడవపడేవాడు. 

దసరాకు ముందు దంపతులు ఘర్షణ పడ్డారు. ఆ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లింది. భర్త విన్నపం మేరకు 4రోజుల క్రితమే అఖిల అత్తవారింటికి వచ్చింది. ఏం జరిగిందో ఏమో! బుధవారం మధ్యాహ్నం దంపతులు మరోసారి గొడవపడ్డారు. క్షణికావేశంలో మధు..భోజనం చేస్తున్న భార్యపై ఇంట్లోనే ఉన్న వ్యవసాయ పనిముట్టుతో దాడిచేశాడు. ఆ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కుమార్తెనూ గాయపరిచాడు. అనంతరం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికొచ్చిన మధు తల్లిదండ్రులు కొడుకు, కోడలు విగతజీవులుగా, మనవరాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారిని 108 వాహనంలో నల్గొండకు తరలించారు.

Also Read : నమ్మించి నరకం చూపించారు : ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ