Job Scam : ‘వచ్చే పోయే రైళ్లను..బోగీలను లెక్కపెట్టే ఉద్యోగం’అంటూ రూ.2.6కోట్లు దోచేసిన కేటుగాళ్లు..

‘వచ్చే పోయే రైళ్లను..ఆ రైళ్లకున్న బోగీలను లెక్కపెట్టే ఉద్యోగం’అంటూ నిరుద్యోగుల నుంచి రూ.2.6కోట్లు దోచేసారు కేటుగాళ్లు..

Job Scam : ‘వచ్చే పోయే రైళ్లను..బోగీలను లెక్కపెట్టే ఉద్యోగం’అంటూ రూ.2.6కోట్లు దోచేసిన కేటుగాళ్లు..

job scam In Delhi

Job Scam : ‘వచ్చే పోయే రైళ్లను లెక్కపెట్టే ఉద్యోగం..ఆ రైళ్లకు బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే ఉద్యోగం’ ఉంది మీరు ‘ఉ’అంటే చాలు ఉద్యోగం ఇప్పించేస్తా..చక్కటి జీతం పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంటూ మీరు నమ్ముతారా? నమ్మకపోవచ్చు. కానీ చదువుకుని ఉద్యోగం లేక..తల్లిదండ్రులకు భారంగా బతుకీడుస్తున్న నిరుద్యోగులు మాత్రం ఉద్యోగం ఇప్పిస్తాం అంటే చాలు నమ్మేస్తారు. నమ్మేసి డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ తరువాత మోసపోయామని తెలిసి ఆవేదన చెందుతారు. మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారనే ఓ మాట అక్షరాల మరోసారి నిజమైంది.. ‘వచ్చే పోయే రైళ్లను లెక్కపెట్టే ఉద్యోగం..ఆ రైళ్లకు బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే ఉద్యోగం’అని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడో కేటుగాడు.

ఈ కేటుగాడి వలలో కొంతమంది నిరుద్యోగులు చిక్కుకోవటమే కాదు..పిచ్చివాళ్లైపోయారు. సదరు మోసగాడి మాటలు నమ్మి డబ్బులు సమర్పించుకోవటమే కాదు దారుణంగా దగాపడ్డారు. సదరు వ్యక్తి చెప్పిన మాట విని 28 మందిని నిరుద్యోగులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వచ్చే పోయే రైళ్లను లెక్కబెడుతూ. ఆ రైళ్లకు ఎన్ని బోగీలు ఉన్నాయో లెక్కబెడుతుకూ కూర్చున్నారు. అలా ఒకరోజు రెండు రోజులుకాదు ఇదో ట్రైనింగ్ అని చెప్పి 28మంది నిరుద్యోగులకు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూర్చోపెట్టాడా కేటుగాడు. అతని చెప్పిన మాటలు నమ్మి వచ్చే పోయే రైళ్లను రైళ్ల బోగీలను లెక్కపెడుతు కూర్చున్నారు నిరుద్యోగులు..!!

రోజుకు 8 గంటల పని (ప్రభుత్వ ఉద్యోగం అంటే అంతేగా మరి) స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో.. ఎన్ని వెళ్తున్నాయో.. వాటికి బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టే ఉద్యోగం అంటూ ఆ ఉద్యోగాలకు పేర్లు (భ) కూడా పెట్టాడు. టీటీఈ, క్లర్క్‌ల ఉద్యోగాలు అంటూ మోసం చేశాడు. ఆ ఉద్యోగాలకు ట్రైనింగ్ అంటూ ఢిల్లీ స్టేషన్ లో నెల రోజులు కూర్చోపెట్టారు. ఈ నెల రోజుల తరువాత మీరు జాబ్ లో జాయిన్ అయిపోవచ్చని నమ్మించాడు. అలా రైల్వేల్లో ఉద్యోగాల పేరుతో ఓ గ్యాంగ్‌ 28 మందిని నెల రోజుల పాటు ట్రైనింగ్ పేరుతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బోగీలు లెక్కపెట్టటానికి కూర్చోపెట్టారు. ఉద్యోగాలు రావాలంటే డబ్బులు లంచంగా ఇవ్వాలని చెప్పి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.2.67కోట్లు వసూలు చేసింగా గ్యాంగ్. కానీ పిచ్చి వాళ్లలాగా నెల రోజుల పాటు స్టేషన్ కు వచ్చే పోయే రైళ్లను లెక్కపెట్టిన తరువాత సదరు గ్యాంగ్ పత్తా లేకుండాపోయేసరికి మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.

తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆ తరువాత ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో శివరామన్‌ అనే కొయంబత్తూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని..రైల్వేల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీకు తెలిసినవారుంటే చెప్పండీ ఇప్పిస్తాను అని సుబ్బుసామిని నమ్మించాడు. శివరామన్ మాటలు నమ్మిన సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను ఢిల్లీకి తీసుకొచ్చి శివరామన్ కు పరిచయం చేశారు. ఫలానా వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడని మదురైలోని చాలా మందికి తెలిసింది. అలా మరో 25మంది సుబ్బుసామిని కలిసి మాక్కూడా ఉద్యోగం ఇప్పించండీ సార్ అని బతిమాలుకున్నారు. దీంతో సుబ్బుసామి ఆ 25మందిని కూడా ఢిల్లీ తీసుకెళ్లారు.

అలా మొత్తం 28మంది నిరుద్యోగులను శివరామన్‌.. వికాస్‌ రాణా అనే మరో వ్యక్తికి పరిచయం చేశాడు. రాణా శివరామన్ ను మించినవాడు. తాను ఉత్తర రైల్వే ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నిరుద్యోగులంతా వారి మాటల్ని నమ్మేశారు. రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్‌ అసిస్టెంట్, క్లర్క్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని పక్కా ప్లాన్ తో నిరుద్యోగులను నమ్మించి శిమరామన్ , రాణాలు 28మంది నుంచి రూ.2.6కోట్లు వసూలు చేశారు.. వారిని ఇంకా నమ్మించటానికి వారి మెడికల్ టెస్టులు చేయించాడు. వారిచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలని చెప్పి కొన్ని రోజులు నాటకమాడారు. ఆ తరువాత ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఇవే మీ ట్రైనింగ్ ఆర్డర్లు అని చెప్పి ఇచ్చారు. ఫేక్ ఐడీ కార్డులు కూడా ఇచ్చారు.

అలా ఆ 28 మందిని నెల రోజుల పాటు ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో కూర్చోపెట్టి వచ్చే పోయే రైళ్లను..వాటి బోగీలను లెక్క పెట్టించాడు. ‘ట్రైనింగ్’పేరుతో. అలా వారు రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌కు వచ్చేపోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కపెడుతు కూర్చున్నారు. అలా నెల రోజులు గడిచాయి. ఇక ట్రైనింగ్ పూర్తి అయ్యింది..ఉద్యోగంలో జాయిన్ అయిపోయాయని సంబరపడ్డారు. అన్నకున్నట్లుగా రాణీ, శివరామన్ లు వారిని ఇంకా నమ్మించేలా ‘ఫేక్’అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా ఇచ్చారు. బాధితులకు ఏమాత్రం అనుమానం రాలేదు.వాటిని పట్టుకుని రైల్వే అధికారుల వద్దకు వెళ్లారు ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి.

వాటిని చూసిన రైల్వే అధికారులు ఇవేంటీ మీకు ఎవరిచ్చారు? మాకు తెలియకుండా మీకు ఉద్యోగాలు ఎవరిచ్చారు? ఇవి షేక్ డాక్యుమెంట్స్ అని తేల్చి చెప్పేసకి షాక్ అయిపోయారు సదరు బాధిత నిరుద్యోగులు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న ఆ 28 మంది సుబ్బుసామిని కలిసారు. పాపం ఆ మోసంలో ఎటువంటి పాత్ర లేని సుబ్బుసామి ఆశ్చర్యపోయారు. నిరుద్యోగులను తీసుకుని ఢిల్లీ ఆర్థిక నేరల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.