Potency Test : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మైనర్లకు లైంగిక సామర్థ్య పరీక్షలు

రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష పూర్తైంది.

Potency Test : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మైనర్లకు లైంగిక సామర్థ్య పరీక్షలు

Potency Test

Potency Test : రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ముగ్గురు నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష పూర్తైంది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వారిని ఆసుపత్రి నుంచి జువైనల్ హోమ్ కు తరలించారు. మరో ఇద్దరికి పొటెన్షియల్ టెస్ట్ కొనసాగుతోంది.

లైంగిక సామర్థ్య పరీక్ష నివేదిక ఛార్జిషీటులో కీలకం కానుంది. మరోవైపు ఈ కేసులో సాదుద్దీన్ మాలిక్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ కేసులో సాదుద్దీన్ మాలిక్ ఏ-1గా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తారా? అన్నది కూడా తేలాల్సి ఉంది.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. విపక్షాలు అధికార పక్షాన్ని టార్గెట్ చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజాప్రతినిధుల పిల్లలు కావడంతో.. నిందితులను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Jubilee Hills Minor Rape : జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఆ ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు

నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ఐదుగురు మైనర్లు మాత్రం జువైనల్ జస్టిస్ బోర్డు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఏ-1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను మూడోరోజు కస్టడీలో భాగంగా విచారించారు. ఆరుగురు నిందితులకు కూడా ఉస్మానియా ఆసుపత్రిలో లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw