Jubilee Hills Minor Rape : జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఆ ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు

జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Jubilee Hills Minor Rape : జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఆ ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు

Jubilee Hills Rape Case

Jubilee Hills Minor Rape : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్ చేసిన వారిని ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలన్నారు. ఆ మేరకు ఫేస్ బుక్ లీగల్ సెల్ కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. అమ్నేషియా పబ్ ఘటనలో మైనర్ బాలిక ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అత్యాచార ఘటనల్లో బాధితుల వివరాలు కానీ ఫొటోలు కానీ బహిర్గతం చేయకూడదు. (Jubilee Hills Minor Rape)

Revanth Letter CM KCR : ప్రభుత్వ వాహనంలో గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా? సీఎం కేసిఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

జూబ్లీహిల్స్ లో నడుస్తున్న కారులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులకు అందిన బాధిత బాలిక మెడికల్ రిపోర్టులో షాక్ కి గురి చేసే విషయాలు బయటపడ్డాయి. ఇప్పటికే బాలికకు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. మెడికల్‌ రిపోర్ట్‌ ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు. బాలిక మెడపై కొన్ని చోట్ల కమిలిపోయిన గుర్తులున్నట్లు వైద్య నివేదికలో వెల్లడైంది.

లైంగిక దాడి సమయంలో బాలికకు గాయాలయ్యాయి. బాలిక శరీరంపై 12 గాయాలున్నట్లు మెడికల్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. మరోవైపు గ్యాంగ్ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. కాసేపట్లో ముగ్గురు మైనర్‌ నిందితుల వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. జువెనల్‌ హోమ్‌లో నిందిత మైనర్లను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..మైనర్ల కష్టడీకి అనుమతి

ఈ కేసులో ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ మొదటి రోజు కస్టడీ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించాడు. సాదుద్దీన్ మాలిక్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా ముందు ఉంచి సాదుద్దీన్ ను పోలీసులు విచారించారు.

విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు మాలిక్. మైనర్లతో తనకి రెండు నెలల ఫ్రెండ్ షిప్ ఉందని తెలిపాడు. ”వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకుతో ఇన్నోవాలో పబ్ కి వచ్చాను. మమల్ని డ్రైవర్ జమీల్ పబ్ వద్దకు తీసుకువచ్చాడు. మొదట బాలికను వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు కలిశాడు. ఆ తర్వాత నేను అనుసరించాను. బాలిక బయటకు వచ్చాక నాతో పాటు మైనర్లు పరిచయం చేసుకున్నాము. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పడంతో బాలిక మాతో పాటు కారులో వచ్చింది. ఇన్నోవా కారుని పబ్ వద్ద పార్క్ చేసి జమీల్ వెళ్లిపోయాడు” అని సాదుద్దీన్ మాలిక్ తెలిపాడు.