Revanth Letter CM KCR : ప్రభుత్వ వాహనంలో గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా? సీఎం కేసిఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

జూబ్లీహిల్స్ లో మొన్న ఒక బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదా..? ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

Revanth Letter CM KCR : ప్రభుత్వ వాహనంలో గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా? సీఎం కేసిఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

Revanth (1)

Revanth Letter CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకుందాం..అన్ని మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ దళాలతో కేసిఆర్ చర్చించాలని సూచించారు. క్లబ్స్, పబ్స్, డ్రగ్స్ నియంత్రించుదాం..మన విశ్వ నగర ఖ్యాతిని కాపాడుదామని అన్నారు. తెలంగాణలో క్షీణిసున్న శాంతి భద్రతలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని తెలిపారు.

తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శశబిషలు లేకుండా ప్రగతి భవన్ కు స్వయంగా వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం వంటి దుష్ట సంస్కృతి తీవ్ర భయాఆందోళనలను కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ ఆడ కూతుళ్ళను బయటకు పంపాలంటే బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Revanth Reddy Slams CM : రేప్ కేసు.. కేసీఆర్, ఓవైసీ ఎందుకు స్పందించలేదు? దాడులు చేస్తామని రేవంత్ రెడ్డి వార్నింగ్రే్

పోరాడి సాధించుకున్న రాష్ట్రం..తెలంగాణకు అవమానకరం కాదా..? మన తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మధ్య ఉన్న రాజకీయ పోరాటాలకు అతీతంగా ఉందని చెప్పారు. దీనికోసం మీరు, మీ వ్యక్తిగత అహంకారాన్ని పక్కన పెట్టి అఖిలపక్షంతో, మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ సంఘాలతో కలిసి చర్చించండి భయాందోళనకు గురవుతున్న ప్రజలకు విశ్వాసం కల్పిద్దామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే సంఘవిద్రోహ శక్తులను, తెర వెనుక వాటికి అండగా ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వారైనా కర్కశంగా తొక్కి వేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉందన్నారు.

జూబ్లీహిల్స్ లో మొన్న ఒక బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదా..? ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారని వస్తున్న వాదనకు మీరు సమాధానం చెప్పరా? ఒక ప్రభుత్వ వాహనంలో ఈ గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా..? మీరు నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఉన్నా, ఎందుకు తొలగించలేదని నిలదీశారు.

Revanth Reddy: రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ చెప్పినట్లు కేసీఆర్ వింటారు: రేవంత్ రెడ్డి

ఇంతకుముందే చిన్నారి చైత్రను చిదిమేయడం ఎంత అమానుషం? వీటికి కారణం అవుతున్న డ్రగ్స్, పబ్స్, క్లబ్స్, వాటి నిర్వాహకులపై ఎందుకు కఠినంగా వ్యవహరిస్తలేరు?ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు సమీక్ష చేయలేదని అడిగారు. ఇది భయాందోళనల్లో ఉన్న తెలంగాణ ప్రజల మనోబలాన్ని దెబ్బ తీస్తాయని చెప్పారు. హైదరాబాద్, తెలంగాణలో ఇంకా శాంతి భద్రతలు దిగజారకుండా, మరొకరు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.