PUBG: పబ్‌జీ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన కొడుకు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్‌జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్‌జీ గేమ్‌కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్‌లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు.

PUBG: పబ్‌జీ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన కొడుకు

Pubg

PUBG: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్‌జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్‌జీ గేమ్‌కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్‌లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు. ఇదే క్రమంలో గత ఆదివారం బాలుడు ఇంట్లో మొబైల్ గేమ్ ఆడుతుండగా, తల్లి సాధన అడ్డుకుంది.

Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

దీంతో కోపం తెచ్చుకున్న కొడుకు, ఇంట్లో ఉన్న తండ్రికి చెందిన లైసెన్స్‌డ్ తుపాకీ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. అక్కడే ఉన్న పదేళ్ల చెల్లిని వేరే గదిలో ఉంచి, బయటికి రాకుండా బంధించాడు. తర్వాత మూడు రోజులపాటు ఇంట్లో తల్లి మృతదేహం పక్కనే ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోయిన వాసన వస్తుండటంతో రకరకాల సెంట్లు, రూమ్ ఫ్రెషనర్లు స్ప్రే చేస్తూ మేనేజ్ చేశాడు. చివరకు దుర్వాసన ఎక్కువ కావడంతో తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, తల్లి మృతికి సంబంధించి కట్టుకథలు చెప్పేందుకు కొడుకు ప్రయత్నించాడు. ఎలక్ట్రిషియన్ వచ్చి తన తల్లిని చంపి వెళ్లాడని చెప్పాడు. అయినప్పటికీ అనుమానం వచ్చిన పోలీసులు బాలుడిని విచారించగా, అసలు విషయం తెలిసింది. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Cordelia: విశాఖ చేరుకున్న విలాస నౌక ‘కార్డెలియా’.. సకల సౌకర్యాలతో అందుబాటులోకి

తాజా ఘటనతో మొబైల్ గేమ్స్ వ్యసనంగా మారుతున్నాయని మరోసారి రుజువైంది. రోజుల తరబడి గేమ్స్ ఆడుతూ చాలా మంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా పబ్‌జీ గేమ్ ఎక్కువగా చెడు ప్రభావం చూపిస్తోంది. గేమ్స్ కోసం చివరకు హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.