Madhya Pradesh : జాతీయ పక్షి నెమలిని హింసించి చంపిన యువకుడు .. కఠినంగా శిక్షించాలని డిమాండ్

Madhya Pradesh : జాతీయ పక్షి నెమలిని హింసించి చంపిన యువకుడు .. కఠినంగా శిక్షించాలని డిమాండ్

Man Torturing Peacock

Updated On : May 22, 2023 / 12:25 PM IST

Madhya Pradesh Man Torturing Peacock : భారత జాతీయ పక్షి నెమలిని అత్యంత క్రూరంగా హింసించి చంపాడో యువకుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వీడసలు మనిషినా? మూగజీవాన్ని ఇంత దారుణంగా హింసించిన వీడిని వదలకూడదు కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వెల్లువెత్తాయి. దీంతో అటవీశాఖ అధికారులురంగంలోకి దిగారు. ఆ యువకుడు ఎవరో గుర్తించి అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. మధ్యప్రదేశ్ లోని కట్నీలో ఓ యువకుడు ఓ నెమలి ఈకలు ఒక్కొక్కటి పీకుతు అది విలవిల్లాడిపోతుంటే చూసి ఆనందించాడు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా దాన్నివీడియో తీశాడు.

నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం అనుభవించటం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాధ తాళలేక చివరకు అది మరణించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. అతడెవరో గుర్తించి కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ శాడిస్టు యువకుడు ఎవరో గుర్తించారు. అతని పేరు అతుల్ గా గుర్తించారు.కానీ అతను పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అతడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు డివిజినల్ ఫారెస్ట్ అధికారి గౌరవ్ శర్మ.