Jharkhand: కూరగాయల మార్కెట్‌కు బాంబుతో వచ్చిన వ్యక్తి.. బాంబు పేలి నలుగురికి తీవ్ర గాయాలు
తర్వాత అతడు కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. అప్పుడే ఆ లగేజ్‌లో ఉన్న బాంబ్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Jharkhand: ఝార్ఖండ్‌లో బాంబు పేలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్, ధన్‌బాద్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఒక వ్యక్తి స్థానిక కూరగాయల మార్కెట్‌కు బైకుపై వచ్చాడు. ఆ బైకుపై లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. వాటిలో బాంబు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి.
Sri Lanka: శ్రీలంకకు భారత్ సాయం.. 75 రవాణా బస్సులు అందజేసిన ఇండియా
తర్వాత అతడు కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. అప్పుడే ఆ లగేజ్‌లో ఉన్న బాంబ్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ నలుగురిలో ముగ్గురు కూరగాయలు అమ్మే వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు బాంబు కావాలనే పేల్చాడా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా? దీనిలో ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.