కాచిగూడ రైల్వేస్టేషన్ లో ప్రమాదం : 2 రైళ్లు ఢీ

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 05:42 AM IST
కాచిగూడ రైల్వేస్టేషన్ లో ప్రమాదం : 2 రైళ్లు ఢీ

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలుని ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఎంఎంటీఎస్ ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది.

ఈ ప్రమాదంలో 3 బోగీలు పక్కకి ఒరిగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బోగీల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. గాయాలపాలైన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై ఉన్నతాధికారలు విచారణకు ఆదేశించారు. ఈ యాక్సిడెంట్ తో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.

ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో బిజీగా ఉండే సమయం ఇది. డ్యూటీలకు, ఆఫీసులకు వెళ్లే సమయం ఇది. ఎంఎంటీఎస్ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. 

పట్టాలపై నిల్చి ఉన్న రైలుకి స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వలేదు. అదే సమయంలో అదే ట్రాక్ పైకి మరో రైలు వచ్చింది. దీంతో రెండు రైళ్లు ఢీకొన్నాయని అధికారులు తెలిపారు.