Woman SI Commits Suicide : పెళ్లి కావట్లేదని మహిళా ఎస్సై ఆత్మహత్య

పెళ్లి విషయంలో బంధువులు, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేని మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా రత్‌లామ్ లో చోటు చేసుకుంది.

Woman SI Commits Suicide : పెళ్లి కావట్లేదని మహిళా ఎస్సై ఆత్మహత్య

Woman Si Commits Suicide

Woman SI Commits Suicide: ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే పిల్లకు పెళ్లెప్పుడు చేస్తారని ఇరుగు పొరుగు వారు, చుట్టాలు అడుగుతూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు సంపాదించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు ఆర్ధికంగా నిలబడ్డాకే వారికి నచ్చిన వరుడ్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈక్రమంలో వారు సూటి పోటి మాటలు భరించాల్సి వస్తోంది.

పెళ్లి విషయంలో బంధువులు, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేని మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా రత్‌లామ్ లో చోటు చేసుకుంది.  రత్‌లామ్ పోలీసు స్టేషన్ లో ఎస్సైగా పనిచేసే కవితా సోలంకి 35 ఏళ్లు వచ్చినా వివాహం చేసుకోలేదు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండటం వల్ల కానీ, ఆమెకు నచ్చిన వరుడు దొరక్కపోవటం వలన కానీ ఆమెకు వివాహం చేసుకోవటం ఆలస్యం అయ్యింది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆమె పెళ్లి విషయమై ఇంట్లో వాళ్లు ఇరుగు పొరుగు వారి నుంచి ప్రశ్నలు ఎదుర్కోంటూనే ఉంటుంది.

ఇటీవల ఆమె తన ఇంటికి మాండ్సౌర్ వెళ్లినప్పుడు ఆమెకు మళ్లీ అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆమె బుధవారం ఇంటినుంచి తిరిగి వచ్చి విధుల్లో చేరింది. బుధవారం రాత్రి తన నివాసంలో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈవిషయాన్ని ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పింది. వెంటనే ఆమె పోలీసులను అలర్ట్ చేసి కవిత వద్దకు వచ్చింది. అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి ఇంటినుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తనకు పెళ్ళి కావటం లేదని ఆందోళన చెందుతున్నానని… వివాహంపై ఇరుగు పొరుగు వారు అనే మాటలకు సమాధానం చెప్పలేక అలిసిపోయానని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.