Remdesivir Drug : వాట్సాప్‌లో చూసి రూ.18వేలకు రెమిడెసివిర్ డ్రగ్ కొన్న మహిళ.. పార్సిల్ తెరిచి చూస్తే షాక్..

కరోనావైరస్‌ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. బెడ్లు దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా రోగుల చికిత్సలో వాడే మందులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో మోసగాళ్ల కన్ను మందులు, ఇంజెక్షన్లపై పడింది. ఇదే అదనుగా నకిలీ టీకాలు అమ్మి సోమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ నకిలీ టీకాలను కొని అడ్డంగా మోసపోయింది.

Remdesivir Drug : వాట్సాప్‌లో చూసి రూ.18వేలకు రెమిడెసివిర్ డ్రగ్ కొన్న మహిళ.. పార్సిల్ తెరిచి చూస్తే షాక్..

Remdesivir Drug

Remdesivir Drug : కరోనావైరస్‌ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. బెడ్లు దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా రోగుల చికిత్సలో వాడే మందులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో మోసగాళ్ల కన్ను మందులు, ఇంజెక్షన్లపై పడింది. ఇదే అదనుగా నకిలీ టీకాలు అమ్మి సోమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ నకిలీ టీకాలను కొని అడ్డంగా మోసపోయింది.

ముంబై తిలక్‌ నగర్‌కు చెందిన ఓ మహిళకు కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ లో ఓ మెసేజ్‌ వచ్చింది. యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌ ను హోం డెలివరీ చేస్తామని దాని సారాంశం. అసలే మార్కెట్ లో రెమిడెసివిర్ కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మంచి చాన్స్. కొనుక్కుంటే పోలే..అని ఆశ పడింది. అంతే.. ఆ మహిళ వెంటనే ఆ వాట్సాప్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఆరు మందు బాటిళ్లను ఆర్డర్‌ చేసింది. ఇందుకోసం అతడు రూ.18వేలు అడిగాడు.

రెండు రోజుల తర్వాత ఆమె ఇంటికి ఓ పార్శిల్‌ వచ్చింది. ఆమె రూ.18 వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకుంది. దాన్ని విప్పి టీకాలను పరిశీలించి చూసి షాక్‌ తింది. ఆమె దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే, ఆ మందు ద్రవ రూపంలో కాకుండా పొడి రూపంలో ఉండటంతో అవి నకిలీవని గుర్తించింది. కాసేపటికి షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే మేసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏదైనా కొనేముందు క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. పూర్తి నిర్ధారణ తర్వాతే కొనాలని సూచించారు. నిజమో కాదో తెలుసుకోకుండా ముందుకెళ్తే భారీ మూల్లం చెల్లించుకోక తప్పదన్నారు.

వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతోపాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత కూడా పెరిగింది. ఇదే అదనుగా కేటుగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. కొందరు వ్యక్తులు రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఇటీవల నోయిడాలో బ్లాక్ మార్కెట్ లో రెమిడెసివర్ ఇంజక్షన్ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 105 వయల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి అవసరంలో ఉన్న వారికి.. ఒక్కో ఇంజెక్షన్ ని 15వేల నుంచి 40వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.