Fake Whatsapp Video Calls : వృద్ధులూ బీకేర్‌ఫుల్.. ఆ వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, ఎంత ప్రమాదమో తెలుసా?
Fake Whatsapp Video Calls : ఆ కాల్లో మహిళ దుస్తులు తీసేసింది. ఒంటి మీదున్న డ్రెస్ తీసేయాలని, నగ్నంగా కనిపించాలని అతడిని కూడా కవ్వించింది.

Fake Whatsapp Video Calls
Cyber Crime : గుర్తు తెలియని నెంబర్లతో వాట్సాప్ కాల్స్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వలపు వలతో యువకులనే కాదు వృద్ధులనూ టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. వాళ్లంతట వాళ్లే ఫోన్ చేస్తారు. ఒంటి మీద దుస్తులు లేకుండా కనిపిస్తారు. నగ్నంగా కనిపించాలని ఎదుటివాళ్లను కవ్విస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. నగ్నంగా ఉండగా.. వాటిని రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. ఇటీవల ఈ ముఠా బారినపడ్డారు ఇద్దరు వృద్ధులు. వారిలో ఒకరు 78ఏళ్ల వ్యక్తి ఉన్నారు.
ఇప్పటిదాకా ఆ ఇద్దరు వృద్ధులు బ్లాక్ మెయిలింగ్ ముఠాకు ఏకంగా రూ.23 లక్షలు చెల్లించుకున్నారు. అయినా డబ్బు కోసం ఇంకా వేధింపులు కంటిన్యూ కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వృద్ధులకు నగ్న వీడియో కాల్స్ చేశారు యువతులు. కాల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.(Fake Whatsapp Video Calls)
Also Read..Kerala : విడాకుల విషయంలో కోర్టు తీర్పుపై ఆగ్రహం.. ఏకంగా జడ్జి కారునే ధ్వంసం చేసిన వ్యక్తి
హైదరాబాద్ నారాయణగూడకి చెందిన 78ఏళ్ల వృద్ధుడికి ఇటీవల్ గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో మహిళ దుస్తులు తీసేసింది. ఒంటి మీదున్న డ్రెస్ తీసేయాలని, నగ్నంగా కనిపించాలని అతడిని కూడా కవ్వించింది. మహిళ మాటలు చేష్టలకు టెంప్ట్ అయిన వృద్ధుడు.. ఆమె కోరినట్లే ఒంటి మీదున్న దుస్తులన్నీ తీసేసి నగ్నంగా నిల్చున్నాడు.
అంతే, ఆ వెంటనే వీడియో కాల్ డిస్ కనెక్ట్ అయిపోయింది. ఆ మరుక్షణమే అదే నెంబర్ నుంచి ఒక మేసేజ్ వచ్చింది. అందులో ఆ వృద్ధుడు మాత్రమే నగ్నంగా ఉన్న వీడియో ఉంది. అంతే, అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దిమ్మతిరిగిపోయింది.(Fake Whatsapp Video Calls)
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలని యువతి బెదిరించింది. దాంతో బాధితుడు బిత్తరపోయాడు. పరువు పోతుందని భయపడ్డాడు. ఆమె చెప్పినట్లుగానే డబ్బు పంపించాడు. వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు బాధితుడు డబ్బులు పంపాడు. కొన్ని రోజుల తర్వాత ఓ వ్యక్తి కాల్ చేశాడు. తనను ఢిల్లీ సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ గా అతడు పరిచయం చేసుకున్నాడు.
అసభ్యకర రీతిలో చాట్ చేసినట్లు ఓ యువతి తమకు ఫిర్యాదు చేసినట్లు వృద్ధుడితో చెప్పాడు. ఫిర్యాదు వాపస్ తీసుకోవడానికి రూ.15లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు రోజుల వ్యవధిలోనే రూ.15లక్షలు చెల్లించాడు. ఇంతటితో ఈ వ్యవహారం ముగిసిందని ఊపిరిపీల్చుకున్నాడు. కానీ, ఆ ముఠా నుంచి డబ్బుల కోసం మళ్లీ బెదిరింపులు మొదలయ్యాయి. దాంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బ్లాక్ మెయిలింగ్ అంశంపై ఫిర్యాదు చేశాడు.
ఇక, ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి అయిన 59ఏళ్ల మరో వృద్ధుడు కూడా ఇలానే మోసపోయాడు. లాలాపేట్ కు చెందిన అతడు సైబర్ నేరగాళ్లకు 8లక్షల రూపాయలు చెల్లించాడు. అయినా ఇంకా బెదిరింపులకు పాల్పడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో ఫేక్ వాట్సాప్ కాల్స్ తరహా మోసాలు భారీగా పెరిగిపోయాయి. వలపు వలతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఊరించి, కవ్వించి సర్వం దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దని నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నారు. తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దని, అవతలి వ్యక్తుల కవ్వింపు చర్యలకు మోసపోవద్దని పదే పదే కోరుతున్నారు. ఇలా పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, చైతన్యం చేస్తున్నా.. ఇంకా కొందరు ప్రజలు మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు.