Shilpa Chowdary : ఈ సారైనా నిజాలు చెపుతుందా శిల్పాచౌదరి ?

కిట్టీ పార్టీల పేరుతో పలువురు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని వారివద్ద నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీకి మరోసారి కోర్టు అనుమతిచ్చింది.

Shilpa Chowdary : ఈ సారైనా నిజాలు చెపుతుందా శిల్పాచౌదరి ?

Shilpa Chowdary

Shilpa Chowdary : కిట్టీ పార్టీల పేరుతో పలువురు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని వారివద్ద నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీకి మరోసారి కోర్టు అనుమతిచ్చింది. శిల్పా చౌదరిని ఈనెల 3,4 తేదీల్లో నార్సింగిలోని ఎస్వోటీ పోలీసు కార్యాలయంలో మొదటి సారి విచారించారు. ఆ విచారణలో ఆమె సరిగా సమాధానాలు చెప్పకపోవటంతో పోలీసులు రెండోసారి కస్టడీకి తీసుకున్నారు.

రెండో విడత కస్టడీ విచారణ  నేటినుంచి ప్రారంభంకానుంది. ఈ విచారణలో ఆమె వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అన్నిరకాలుగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి సారి రెండ్రోజుల కస్టడీలో మీడియా వల్ల అనేక అంశాలపై కేసు అటు – ఇటు తిరిగి, ఎందరి పేర్లో బయటకు రావడం పట్ల శిల్పా తరపు న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాక శిల్పాచౌదరీ కస్టడీలో చెప్పాల్సిన విషయాలు పక్కన బెట్టి, పోలీసులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది.

శిల్ప తీసుకున్న కోట్ల రూపాయల డబ్బు ఎక్కడ దాచింది…ఏం  చేసింది?…. శిల్పా పలువురికి  డబ్బులు ఇచ్చినట్లు  తెలిపిన  వివరాలపై  వాస్తవం లేదంటూ రాధికారెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది.  గత కస్టడీలో  శిల్పాచౌదరి కొంతమంది పేర్లు ప్రస్తావించిన నేపథ్యంలో.. ఈసారి   వారిని కూడా పిలిచి   ఇద్దరినీ ఫేస్ to ఫేస్   కూర్చోబెట్టి   విచారించే పనిలో పోలీసులు ఉన్నారు. శిల్పా చౌదరి చెప్పిన రాధికారెడ్డి, కొంపల్లి మల్లారెడ్డికి  మధ్యవర్తిత్వం పైనా  పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read : TN Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు
అధిక వడ్డీ పేరుతో ఎవరు.. ఎవరికి డబ్బులు ఇచ్చారు? అనేది తేలాల్సి ఉంది. కొంపల్లి మల్లారెడ్డికి, ఎన్నారై ప్రతాప్‌రెడ్డి‌కి కోట్లు  ఇచ్చినట్టు శిల్ప ఇంతకు ముందు విచారణలో చెప్పింది.  ఈ రెండు రోజుల విచారణలో వారిని కూడా పిలిచి ముఖాముఖి   విచారించే  అవకాశం ఉంది. వందల కోట్ల డబ్బులు మోసం చేసినట్టు పైకి కనపడుతున్నా, కేవలం రూ.18 కోట్ల వరకే శిల్ప లెక్కలు చెపుతోంది.

కాబట్టి  మిగిలిన డబ్బంతా ఏమైంది?  అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నారు. శిల్పా చౌదరి గతంలో రెండేళ్లు అమెరికాలో ఉండి వచ్చింది. అయితే శిల్పా చౌదరి అమెరికా ఎందుకు వెళ్లింది. ఎవరెవరు వెళ్లారు. అక్కడేమైనా వ్యాపార లావాదేవీలు నిర్వహించారా…. ఎవరెవరితో నిర్వహించారు అనే కోణంలో కూడా ఈసారి పోలీసులు శిల్పాను ప్రశ్నించనున్నారు.