Rave Party : అడవిలో అర్ధరాత్రి రేవ్ పార్టీలు

నగరాల్లో పోలీసుల దాడులు పెరిగిపోవటంతో అసాంఘిక కార్యకలాపాలు క్రమేపి అడవుల్లోకి మారుతున్నాయి.

Rave Party : అడవిలో అర్ధరాత్రి రేవ్ పార్టీలు

Karnataka Rave Party

Rave Party :  నగరాల్లో పోలీసుల దాడులు పెరిగిపోవటంతో అసాంఘిక కార్యకలాపాలు క్రమేపి అడవుల్లోకి మారుతున్నాయి. కర్ణాటకలోని బెంగుళూరు నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి…మరో 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దులలో గల తమ్మనాయకహళ్లి అటవీ ప్రాంతంలో గల ముత్యాల మడుగు కాలువ వద్ద ఉన్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ నిర్వహించారు.

ఈ  రేవ్ పార్టీలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గోని మత్తు మందు సేవించి డ్యాన్సులు చేస్తున్నట్లు అనేకల్ పోలీసులకు సమచారం అందింది. దీంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసారు. అందినంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలా మంది కేరళకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీకి విద్యార్ధులు ఉద్యోగస్తులు హాజరైనట్లు సమాచారం. పార్టీకి 60మంది కి పైగా హజరు కాగా పోలీసులను చూసి చాలామంది పరారయ్యారు. అదుపులోకి తీసుకున్నవారి రక్త నమూనాలు. వెంట్రుకలు పరీక్షల కోసం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

బెంగుళూరుకు చెందిన అభిలాష్ అనే వ్యక్తి రేవ్ పార్టీ నిర్వాహకుడు. ఓ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. మోడల్స్‌ను, డీజేలను  పిలిపించారు. శనివారం  రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం  కాగా నిర్వాహకులు అర్ధరాత్రి సమయంలో డీజే సౌండ్ పెంచారు. చుట్టూ అడవి ఉండటంతో ఎవరికీ ఏమీ తెలియలేదు.

పోలీసులు ఘటనా స్ధలంలో మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న రిసార్ట్ కు ఎటువంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకులు తీసుకువచ్చిన వాహానాలను, డీజే సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అడవిలో తప్పించుకున్న వారి కోసం గాలింపు చేపట్టారు.