Karnataka: అస్వస్థతకు గురైన 2వ తరగతి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి దుశ్చర్యకు పాల్పడ్డ ప్రిన్సిపాల్
బాలిక భయాందోళనకు గురై పాఠశాల పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక కడుపునొప్పితో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.

Bengaluru: బెంగళూరులోని ఓ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థినిపై ఏకంగా ప్రిన్సిపాలే అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అది కూడా అస్వస్థతకు గురైన చిన్నారిని, వైద్యం పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు ప్రిన్సిపాల్. 2వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైందని తెలుసుకున్న ప్రిన్సిపాల్ తరగతి గదికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ఈ దుర్మార్గానికి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో.. చిన్నారి పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక భయాందోళనకు గురై పాఠశాల పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక కడుపునొప్పితో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. అండర్‌గార్‌మెంట్‌లో రక్తస్రావాన్ని చూసిన తల్లి ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది.
Article 370 Revocation: రద్దు చేసి నేటితో నాలుగేళ్లు పూర్తైంది.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ఎలా ఉంది?
ఆసుపత్రికి వెళ్లిన తర్వాత, నెమ్మదిగా అమ్మాయి తన తల్లికి జరిగిందంతా చెప్పింది. బాలిక తల్లిదండ్రులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.