Punjab AAP MLA Arrested : లంచం కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ అరెస్ట్

పంజాబ్ లో లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్‌ఫట్టా అరెస్ట్ అయ్యారు. భటిండా రూరల్ ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్ పట్టాను విజిలెన్స్ బ్యూరో లంచం కేసులో అరెస్ట్ చేశారు.

Punjab AAP MLA Arrested : లంచం కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ అరెస్ట్

Punjab AAP MLA Amit Ratan Kotphatta arrested in bribery case..

Punjab AAP MLA arrested : ఢిల్లీలో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్థానం జాతీయ పార్టీ స్థాయికి చేరింది. పంజాబ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అవినీతి నిర్మూలనే ఎజెండాగా స్థాపించిన ఆప్ కు కూడా అవినీతి మరకలు అంటుకుంటున్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్,తాజాగా పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యే లంచం కేసులో ఇరుక్కోవటం చూస్తే ఇక రాజకీయాలు అంటే ఇంతేనా? అనేలా ఉన్నాయి. తాజాగా పంజాబ్ లో లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్‌ఫట్టా అరెస్ట్ అయ్యారు. భటిండా రూరల్ ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్ పట్టాను విజిలెన్స్ బ్యూరో లంచం కేసులో బుధవారం (ఫిబ్రవరి 23,2023) రాజ్ పురా ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

రూ.25 లక్షల గ్రాంట్ ను విడుదల చేయాలంటే రూ.5లక్షలు లంచం ఇవ్వాలని ఎమ్మెల్యే అమిత్ రత్తన్ డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే పీఏ ద్వారా లంచం డిమాండ్ చేశారని ఓ సర్పంచ్ ఫిర్యాదు చేయటంతో అమిత్ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు కోరనున్నారు అధికారులు.

ఎమ్మెల్యే అమిత్ ను అరెస్ట్ చేయటానికి ముందు ఫిబ్రవరి 16న అతని పీఏను అరెస్టు చేశారు. పీఏ రేషమ్ గార్గ్ రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌ బృందం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు తాజాగా ఎమ్మెల్యేను కూడా రాజ్‌పురాలో బుధవారం సాయత్రం అరెస్టు చేసినట్టు విజిలెన్స్ బ్యూరో అధికారి తెలిపారు.

భటిండాలోని ఘుడా గ్రామ సర్పంచ్ తన గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.25 లక్షల ప్రభుత్వ గ్రాంట్ ను విడుదల చేయటానికి ఎమ్మెల్యే అమిత్ ఏపీ రషీమ్ గార్గ్‌తో రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారుల పక్కాగా ప్లాన్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యే అమిత్ ను అరెస్ట్ చేశారు. విజిలెన్స్ బ్యూరో డీఎస్పీ సందీప్ సింగ్ నేతృత్వంలో విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అధికారులు అరెస్ట్ చేసే సమయంలో పీఏ పారిపోవటానికి యత్నించాడు. కానీ అధికారులు వెంటనే అప్రమత్తమై అరెస్టు చేశారు. కాగా..రషీమ్ గార్గ్ కు తనకు ఎటువంటి సంబంధంలేదని అతను నాకు పీఏ కాదని ఎమ్మెల్యే అమిత్ ఖండించారు. ఇలా లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ కావటంతో ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ విమర్శలకు ఆప్ కూడా స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లటానికి ఇలాంటి విమర్శలుచేస్తున్నాయని ఎదురు విమర్శలు చేస్తోంది. కాగా ఎమ్మెల్యే అమిత్ పై అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంనుంచి అతనిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే లంచం కేసులో పీఏ చెప్పిన సాక్ష్యంతో అమిత్ ను అరెస్ట్ చేశారు.