UPI Fraud: కొత్త నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే

సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్‌కు ముందుగా మనీ పంపిస్తారు.

UPI Fraud: కొత్త నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే

UPI Fraud: ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ ద్వారా తెలియని నెంబర్ల నుంచి మనీ వచ్చిందా? అయితే జాగ్రత్త! ఎందుకంటే మీరు సైబర్ క్రైమ్ బారిన పడొచ్చు. సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!

ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్‌కు ముందుగా మనీ పంపిస్తారు. తెలియని నెంబర్ నుంచి మనీ ఎవరు పంపారా అని ఆలోచించే లోపే మీకు కాల్ వస్తుంది. వేరే నెంబర్‌కు పంపాల్సిన అమౌంట్ పొరపాటున మీకు ట్రాన్స్‌ఫర్ అయిందని, వెంటనే తమకు ఆ డబ్బులు రిటర్న్ చేయమని అడుగుతురు. వాళ్లు చెప్పిన నెంబర్‌కు, చెప్పినట్లు డబ్బు తిరిగి పంపాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇది నిజమే అని వాళ్లకు ఆ డబ్బు తిరిగి పంపారో.. అంతే సంగతులు! మీ అకౌంటుకు సంబంధించిన సమాచారం మొత్తం వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

Zimbabwe: భూమిలోకి కుంగిపోయిన క్లాస్ రూమ్.. 17 మందికి విద్యార్థులకు గాయాలు

మీ బ్యాంక్ అకౌంట్లు, పాస్ వర్డ్, పాన్, ఆధార్ వంటి కేవైసీ డీటైల్స్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. మీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడానికి వాళ్లకు ఈ వివరాలు చాలు. మీ అకౌంట్లో ఉన్న డబ్బును వాళ్లు తెలివిగా కొట్టేస్తారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల కొత్తగా అనుసరిస్తున్న పంథా ఇది. అందుకే కొత్త నెంబర్ నుంచి మీ యూపీఐ అకౌంట్‌కు డబ్బులు క్రెడిట్ అయ్యి.. వాటిని ఎవరైనా తిరిగి పంపాలి అని కోరితే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడతారేమో ఆలోచించాలి అని పలువురు సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.