Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు… పలు చోట్ల వడగళ్ల వర్షం.. మరో రెండు రోజులు వానలే!

Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది.

Indian Railways: రైలులో పెంపుడు కుక్కతో ప్రయాణం.. రైల్వే మంత్రి ఏమంటున్నారంటే

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, శేరిలింగం పల్లి, కూకట్ పల్లితోపాటు నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగితోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో వడగళ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఏపీకి సంబంధించి ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో వడగళ్ల వాన పడింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది.

AAP Vs BJP: ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపణ

శింగనమల, నార్పల, నాయనపల్లి క్రాస్ రోడ్ ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. భారీ వర్షాలకు వరి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లా పులివెందులలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుతో కూడిన వర్షం పడటం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అనేక ప్రాంతాలు, ఏపీలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.