Suicide Blast in Pakistan: పాకిస్తాన్‭లోని మసీదులో ఆత్మహుతి దాడి.. 52 మంది మృతి 130 మందికి గాయాలు

పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల పాకిస్థాన్ తాత్కాలిక హోంమంత్రి సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తీ సంతాపం వ్యక్తం చేస్తూ, పేలుడును ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదా విశ్వాసం లేదని, రెస్క్యూ ఆపరేషన్‌లో అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు

Suicide Blast in Pakistan: పాకిస్తాన్‭లోని మసీదులో ఆత్మహుతి దాడి.. 52 మంది మృతి 130 మందికి గాయాలు

Suicide Blast in Balochistan: పాకిస్థాన్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిలో 52 మంది మరణించారు. చనిపోయిన వారిలో కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే చాలా 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని పాక్ లీడింగ్ పత్రిక డాన్ వెల్లడించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మస్తుంగ్‌లోని అల్ ఫలాహ్ రోడ్‌లో ఉన్న మదీనా మసీదు సమీపంలో పేలుడు సంభవించిందని మస్తుంగ్ అసిస్టెంట్ కమిషనర్ అత్తాహుల్ మునిమ్ తెలిపారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఊరేగింపులో పాల్గొనడానికి ప్రజలు అక్కడ గుమిగూడిన సమయంలో ఇది జరిగింది.

షహీద్ నవాబ్ గౌస్ బక్ష్ రైసానీ మెమోరియల్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సయీద్ మిర్వానీని ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక మరణాలను వెల్లడించింది. పేలుడు ఆత్మాహుతి దాడని, ఇది డీఎస్పీ గిస్ఖౌరీ కారు సమీపంలో పేలిందని ఆయన చెప్పారు. మస్తుంగ్‌కు రెస్క్యూ టీమ్‌ను పంపినట్లు బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జన్ అచక్జాయ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలిస్తున్నామని, అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ విధించామని చెప్పారు. తమ శత్రువులు విదేశీ సహాయంతో బలూచిస్థాన్‌లో మత సహనం, శాంతిని నాశనం చేయాలని చూస్తున్నారని జన్ అచక్జాయ్ అన్నారు.

London Bridge : తెరుచుకున్న లండన్ బ్రిడ్జ్, ట్రాఫిక్ జామ్ సమస్యలోనూ అద్భుతాన్ని ఆస్వాదించిన నగరవాసులు

పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల పాకిస్థాన్ తాత్కాలిక హోంమంత్రి సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తీ సంతాపం వ్యక్తం చేస్తూ, పేలుడును ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదా విశ్వాసం లేదని, రెస్క్యూ ఆపరేషన్‌లో అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు. క్షతగాత్రుల చికిత్సలో రాజీపడమని, అలాగే తీవ్రవాదుల విషయంలో కూడా రాజీపడేది లేదని బుగ్తీ అన్నారు.