Kodanad Estate Murder Case: నాబెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి సార్.. కోర్టును వేడుకున్న హత్య,దోపిడీ కేసు నిందితుడు

నా బెయిల్ రద్దు చేసి నన్ను జైల్లో పెట్టండీ..జడ్జిని కోరాడు హత్య, దోపిడీ కేసులో నిందితుడు.

Kodanad Estate Murder Case: నాబెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి సార్.. కోర్టును వేడుకున్న హత్య,దోపిడీ కేసు నిందితుడు

Tamil Nadu Kodanad Estate Murder Case

Updated On : February 3, 2022 / 5:41 PM IST

Tamil Nadu Kodanad Estate Murder Case: చోరీలు..హత్యలు, అత్యాచారాల కేసుల్లో నిందితులకు బెయిల్ వస్తే అమ్మయ్యా అనుకుంటారు. బెయిల్ రాకపోతే పదే పదే బెయిల్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటారు. కానీ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి బెయిల్ పై బయటకొచ్చాడు. కానీ ఎక్కువ కాలం బయట ఉండలేకపోయాడు. దీంతో బయట కంటే జైలే నయం అనుకున్నాడు. అంతే ‘‘సార్ మిమ్మల్ని వేడుకుంటున్నా..నా బెయిల్ రద్దు చేసి నన్ను జైల్లో పెట్టండయ్యా’అంటూ జిల్లా సెషన్స్ కోర్టులో న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. దానికి బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. ఎవరా నిందితుడు. ఎందుకు బెయిల్ రద్దు చేయమంటున్నాడు. జైలుకు ఎందుకు తిరిగి వెళ్లాలనుకుంటున్నాడంటే..దాని వెనుక ఓ కథే ఉంది..

Also read : ‘I Want to Go to Prison’ : నా భార్యతో ఉంటే నరకంలో ఉన్నట్లుంది..నన్ను జైల్లో వేయండీ సార్..

తమిళనాడులోని కొడనాడు ఎస్టేట్ హత్య, దోపిడీ కేసులో నిందితుల్లో వాలయార్ మనోజ్ అనే వ్యక్తి నిందితుడగా ఉన్నాడు. తనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలంటూ ఊటీ జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత చెందిన కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసుపై డీఎంకే అధికారంలోకి వచ్చాక పునర్విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పలువురు నిందితులను ఒక్కొక్కరుగా విడివిడిగా విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది.

ఈ క్రమంలో ఈ కేసులో అరెస్టైన మనోజ్.. 2020 నవంబరులో బెయిల్‌పై విడుదలయ్యాడు. రెండు నెలలు బయట ఉన్నాడు. కానీ తనకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైల్లో ఉంచాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ మంజూరు సమయంలో విధించిన కఠిన నిబంధనలే తన వినతికి కారణమని నిందితుడు కోర్టుకు విన్నవించుకున్నాడు. బెయిల్ షరతుల మేరకు మనోజ్ ఊటీని విడిచి వెళ్లటానికి వీల్లేదని నిబంధనల్లో ఉంది.

Also read : ఈ జనాలతో ఉండలేను..వాళ్లతో వేగలేను భయ్యా..నన్ను జైల్లో పెట్టండి ప్లీజ్..

అలాగే ప్రతి సోమవారం జిల్లా కోర్టులోని రిజిస్టర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది బెయిల్ మంజూరు సందర్భంగా. ఇది రూల్ కూడా. అలా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్ కు ఊటీలో తనకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఎవరూ అద్దెకు రూములు ఇవ్వడం లేదని మనోజ్ కోర్టుముందు వాపోయాడు. అలాగే అక్కడ తనకు ఎవ్వరు పనికూడా ఇవ్వటంలేదని..దీంతో తినటానికి తిండి కూడా ఉండటంలేదరి ఇలా ఆకలితో బయటే ఉండేబదులు జైల్లోనే నయమని వాపోయాడు మనోజ్.

తాను మధుమేహంతో బాధపడుతున్నానని దీంతో సమయానికి తిండి లేకపోతే చచ్చిపోతానని..పైగా ఇది అసలే శీతాలం పైగా ఊటీ. ఇక్కడి శీతాకాలం వాతావరణానికి చలికి తట్టుకోలేకపోతున్నానని దీంతో ఆరోగ్యం బాగా పాడవుతోందని బెయిల్ కఠిన నిబంధనలు తన పాలిట శాపంగా మారాయంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.

ఈ పిటిషన్‌పై గురువారం (ఫిబ్రవరి 3,2022) కోర్టు విచారణ జరపనుంది. మరో గత్యంతరం లేకనే తన బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించాలని మనోజ్ కోర్టును కోరుతున్నట్లు అతని తరఫు న్యాయవాది మునిరత్నం తెలిపారు. కాగా..దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొడనాడు హత్య కేసులో మనోజ్ రెండో నిందితుడిగా ఉన్నాడు. ప్రధాన నిందితుడు కేవీ సయన్‌తో పాటు మనోజ్‌ను 2019 జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు.