టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

10TV Telugu News

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం నెలకొంది. సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ధర్మారామ్ సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని వాసవీ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ధర్మారామ్.. ఏడో ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. ధర్మారామ్ నారాయణ కాలేజీలో ఇంటర్ చదివాడు.
Also Read : ఇంటర్ బోర్డు లీలలు : ఫస్టియర్‌లో జిల్లా టాపర్, సెకండియర్‌లో తెలుగులో ఫెయిల్ 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం (ఏప్రిల్ 19, 2019) రాత్రి ధర్మారామ్ బిల్డింగ్ పైనుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం (ఏప్రిల్ 20,2019) చనిపోయాడు. ధర్మారామ్.. సీఎం రమేష్ చెల్లెలి కుమారుడు.

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం విద్యార్థుల ప్రాణాలు తీస్తోంది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయనే డిప్రెషన్ తో ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా టీడీపీ నేత రమేష్ మేనల్లుడు బలయ్యాడు. పిల్లల భవిష్యత్ తో తెలంగాణ ఇంటర్ బోర్డు ఆటలాడిందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుల తడక మార్కులిస్టులతో విద్యార్ధులను అయోమయంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్ 

పాస్ అవుతామని నమ్మకంగా ఉన్న వారు ఫెయిల్ అయ్యారు. 100 మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్ గా ఉన్నవారికి సున్నా మార్కులు వచ్చాయి. ఈ మార్కులు, ఫలితాలు చూసి విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.