Hyd Metro : మెట్రోస్టేషన్‌పై నుంచి దూకిన యువతి పరిస్థితి విషమం, తనంటతానే దూకిందా ?

మెట్రోస్టేషన్ నుంచి ఎందుకు దూకింది అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలా ? ఆర్ధిక సమస్యలా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

Hyd Metro : మెట్రోస్టేషన్‌పై నుంచి దూకిన యువతి పరిస్థితి విషమం, తనంటతానే దూకిందా ?

Hyderabad Metro

Young Woman Jumped Metro Station : అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు బంజారాహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 2వ అంతస్తు 3వ ప్లాట్‌ఫాం నుంచి దూకిందంటూ మెట్రో సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. యువతి తనంతట తానే దూకినట్లు గుర్తించారు.

Read More : TSRTC : ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు హెచ్చరికలు, భారీ జరిమాన..ఒప్పందం రద్దు!

రాత్రి 8గంటల సమయంలో అమీర్‌పేట్‌లోని మెట్రోస్టేషన్ రెండో అంతస్తు నుంచి యువతి దూకింది. దీంతో పక్కనే ఉన్న టింబర్ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువతికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. టోలిచౌక్‌కి చెందిన హీనాగా గుర్తించారు. అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఆమె ఉంటున్నట్లు నిర్ధారించారు. ఈమె బీటెక్ చేస్తూ అమీర్ పేట్ లోని ఓ ఇన్సి ట్యూట్ లో శిక్షణ తీసుకొంటోందని తెలుస్తోంది. మాదాపూర్ నుండి అమీర్ పేట్ లోని ఓ హాస్టల్ లోకి రీసేంట్ గా షిప్ట్ అయ్యారు.

Read More : Katrina – Vicky Kaushal : త్వరలో కత్రినా కైఫ్ వివాహం..ఎవరితో ?

2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం మాదాపూర్‌ నుంచి మెట్రో రైల్‌లో అమీర్‌పేటకు వచ్చిన హీనా.. అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మెట్రో స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఆమె స్వయంగా 2వ అంతస్తు నుంచి దూకినట్లు సీసీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది. అయితే.. మెట్రోస్టేషన్ నుంచి ఎందుకు దూకింది అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలా ? ఆర్ధిక సమస్యలా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.