TSRTC : ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు హెచ్చరికలు, భారీ జరిమాన..ఒప్పందం రద్దు!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది.. తాజాగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరికలు జారీ చేశారు.

10TV Telugu News

TSRTC Chairman Warns : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది.. తాజాగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరికలు జారీ చేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్‌ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తప్పనిసని చేస్తూ చైర్మన్‌ బాజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హకీంపేట, వరంగల్‌లో ఉన్న టీఎస్‌ఆర్టీసీ శిక్షణాకేంద్రాల్లో శిక్షణ పొందాలన్నారు. అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లకు తప్పకుండా శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు గోవర్ధన్‌ రెడ్డి.

Read More : Indian Railways : రైలు ప్రయాణీకులకు శుభవార్త..స్పెషల్ రైళ్లు రద్దు, పెంచిన టికెట్ ధరలు తగ్గింపు!

వరంగల్ శిక్షణ కేంద్రంలో వారి డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని లేదంటే TSRTC భారీ జరిమానాలు విధించడానికి వెనుకాడదని స్పష్టం చేశారు చైర్మన్ బాజిరెడ్డి. ప్రైవేట్ అద్దె బస్సు యజమానులు తమ మార్గాలను సరిదిద్దుకోకుంటే వారితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని వార్నింగ్‌ ఇచ్చారు. అద్దె బస్సు డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా, అధిక వేగంగా బస్సులు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు.

Read More : Moon Oxygen : చంద్రుడిపై లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ?

ఈ నేపథ్యంలో అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన అద్దె బస్సు డ్రైవర్లు శిక్షణకు హజరవ్వాలని సూచించారు. శిక్షణకు హజరుకాకపోతే జరిమానా విధించడంతో పాటు ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

×