Crime News: దృశ్యం సినిమా పది సార్లు చూసి.. ప్రియుడితో తండ్రిని హత్య చేయించిన కుమార్తె.. సహకరించిన తల్లి.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

కర్ణాటక రాష్ట్రం బెళగానిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Crime News: దృశ్యం సినిమా పది సార్లు చూసి.. ప్రియుడితో తండ్రిని హత్య చేయించిన కుమార్తె.. సహకరించిన తల్లి.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

Karnataka Police

Crime News: కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యకు ముందు మృతుడి భార్య, కుమార్తె, ఆమె ప్రియుడు దృశ్యం సినిమాను పది సార్లు చూసినట్లు, దృశ్యం సినిమా తరహాలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేలా హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

CM KCR: నేడు యాదగిరి గుట్టకు సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యం ..

బెళగావి నగరానికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్ కాంబళె (57) గతంలో దుబాయ్ లో పనిచేసేవారు. కరోనా సమయంలో దుబాయ్ నుంచి తన సొంత ఇంటికి వచ్చి భార్య రోహిణి, వారి కుమార్తె స్నేహలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె స్నేహ మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న సమయంలో అక్షయ్ విఠకర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వారిప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి సుధీర్ మందలించాడు. అయినా స్నేహ తీరులో మార్పురాకపోవటంతో తండ్రి, కుతురు మధ్య పలుసార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో తన తండ్రి ఉంటే ప్రియుడితో కలిసి ఉండలేమని భావించిన కుమార్తె తండ్రిని హత్య చేసేందుకు నిర్ణయించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమెకూడా అందుకు సహకరిస్తానని చెప్పింది. వెంటనే స్నేహ తన ప్రియుడిని పిలిపించి విషయాన్ని చెప్పింది. అయితే హత్య అనంతరం ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేలా వీరు దృశ్యం సినిమాను పది సార్లు చూశారు. దృశ్యం సినిమా తరహాలో అందరూ ఒకేమాటపై ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17న తన తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో ప్రియుడు అక్షయ్ విఠకర్ ను స్నేహ ఇంటికి పిలిపించింది. స్నేహ, ఆమె తల్లి సుధీర్ కాళ్లు, చేతులు బలంగా పట్టుకోగా విఠకర్ కత్తితో పలుసార్లు పొడిచాడు. అనంతరం సుధీర్ మృతిచెందాడని నిర్ధారించుకున్నారు. వెంటనే ప్రియుడు విఠకర్ ను అక్కడి నుంచి పంపించివేశారు.

ఆ తరువాత తన భర్తను ఎవరో హత్యచేశారంటూ రోహిణి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. స్నేహ, రోహిణిలపై అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు, ఏ విషయంపై అడిగినా తల్లీ, కుమార్తె ఒకే సమాధానం చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి అదుపులోకి తీసుకొని గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు భార్య సహకారంతో కుమార్తె, ప్రియుడు సుధీర్ కాంబళెను హత్యచేయించినట్లు పోలీసులు నిర్ధారించి ముగ్గురిని అరెస్టు చేశారు.