Srikakulam : ఎరక్కపోయి వచ్చి… ఇరుక్కుపోయిన దొంగ

దేవాలయంలో  దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు  దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

Srikakulam : ఎరక్కపోయి వచ్చి… ఇరుక్కుపోయిన దొంగ

Srikakulam Theft Trapped window

Srikakulam : దేవాలయంలో  దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు  దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో ఊరికి చివరిగా జామి ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో దొంగతనం చేసేందుకు కంచిలికి చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి మంగళవారం తెల్లవారు ఝూమున ప్రయత్నం చేశాడు.

గుడి కిటికీ పగల గొట్టి  గుడిలోకి ప్రవేశించాడు.  అమ్మవారి విగ్రహానికి ఉన్న ఆభరణాలు ఇతర విలువైన  వస్తువులు దొంగిలించి తిరిగి అదే కిటికీ నుంచి బయటకు  వచ్చేందుకు ప్రయత్నించాడు.  పాపారావు దురదృష్టమో… అమ్మవారి మహత్యమో తెలియదు కానీ లోపలకు వెళ్లిన పాపారావు బయటకు రాలేకపోయాడు…తిరిగి వెనక్కి   దిగలేక కిటికీలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.
Also Read : CM Jagan-PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ
ఈలోగా గ్రామస్థులు అటుగా వచ్చి పాపారావును చూశారు. పాపారావు చేతిలో ఉన్న అమ్మవారి నగలు కింద పడిపోయి ఉండటం గమనించారు. పాపారావు రక్షించాలని ఎంత వేడుకున్నా కనికరించక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వచ్చే లోగా పాపారావు పరిస్ధితిని వీడియో తీసి తర్వాత బయటకు తీసి దేహశుధ్ది చేశారు. అనంతరం కంచిలి పోలీసులకు అప్పగించారు. పాపారావు మీద కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.