CM Jagan-PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో సీఎం జగన్ ప్రస్తావించారు. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.

Jagan Modi
CM Jagan’s meeting with PM Modi : ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ, జగన్ మధ్య గంటకు పైగా చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో జగన్ ప్రస్తావించారు. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు.
పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నిధులపై ప్రధానితో సీఎం జగన్ చర్చించారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ అవుతారు.
CM Jagan Convoy : సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పంపించిన పోలీసులు
రాత్రి 9:30గంటలకు హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరే అవకాశం ఉంది.