Chhattisgarh : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.

Chhattisgarh : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

Chhattisgarh

Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో కొంత మంది మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, డీఆర్ జీ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మృతుల్లో డీఆర్ జీ జవాన్లు, ఏఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. సుక్మా జిల్లా జగ్గర్ గూడ డీఆర్ జీ పార్టీకి సంబంధించిన జవాన్లు మావోయిస్టుల కూంబింగ్ ప్ర్రక్రియకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులపై జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిపారు.

Encounter Maoist Killed : ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

పోలీసుల కాల్పుల్లో డీఆర్ జీకి చెందిన ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ ప్రక్రియ సాగుతోంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ముగ్గురు పోలీసులు మాత్రమే మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో జాగిర్ గూడ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన మావోయిస్టులు ఒక్కసారిగా పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. ప్రాణ నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పోలీసుల కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది.