Tirupur Theft : చెన్నై-ముంబై రైలులో ఛేజింగ్ సీన్:నాగపూర్ లో దొంగలు పట్టివేత

తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది.

Tirupur Theft : చెన్నై-ముంబై రైలులో ఛేజింగ్ సీన్:నాగపూర్ లో దొంగలు పట్టివేత

Tirupur Cops Arrested 4 Burglars

Tirupur Theft :  దొంగలను పట్టుకోటానికి పోలీసులు సాధారణంగా బైక్ ల మీద, జీపులు, బస్సులుకార్లలో ఛేజ్ చేసి పట్టుకుంటారు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు విమానంలో ఛేజ్ చేసి దొంగలుతమ స్దావరాన్ని చేరుకోకుండానే మార్గమధ్యలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమిళనాడుపోలీసులు దాదాపు అలాగే చేశారు. పారిపోతున్న దొంగలను రైల్వే పోలీసులు సాయంతో పట్టుకున్నారు.

తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది. దుండగులు దుకాణంలోని 3.3 కేజీల బంగారం, 27 కేజీల వెండి,25 లక్షల నగదు దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం చోరీ ఘటన తెలుసుకున్న జయకుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నలుగురు యువకులు ఈ దోపిడీ చేసినట్లు గుర్తించారు.
Also Read : Tamilnadu : వాష్‌రూమ్‌లో కాలుజారి పడ్డ మహిళ గొంతులో ఇరుక్కుపోయిన టూత్ బ్రష్
వారు దోపిడీ అనంతరం తిరుప్పూరు నుంచి బయలు దేరి చెన్నై మీదుగా భాగ్ మతి ఎక్స్ ప్రెస్ లో త్రిపుర వెళ్తుండటం గమనించారు. వెంటనే చెన్నై చేరుకుని ముంబై వెళ్లే తర్వాత రైలు ఎక్కి ముందు వెళుతున్నరైలును ఛేజ్ చేయసాగారు. మరోవైపు ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు ఒక టీం సీసీటీవీ ఫుటేజిని పరిశీలించసాగింది. ట్రైన్ లో వెళుతున్న పోలీసులకు అప్ డేట్స్ ఇవ్వసాగారు.

దుండగులువెళుతున్నరైలు ఆదివారం తెల్లవారుఝూమున నాగపూర్ స్టేషన్ కు చేరుకుంది. రైల్వే పోలీసుల సాయంతో ఆనలుగురు యువకులను నాగపూర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకీ పాల్పడింది తామేనని దుండగులు అంగీకరించారు. వీరంతా బీహార్ లోని అరారియాకు చెందిన ఎ.మహతాబ్ ఆలం(37), జె.బద్రుల్ (20) ఎ.మహ్మద్ సుభాన్(30), ఎ.దిల్కాస్ (20)లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 3.3 కేజీల బంగారం,27 కేజీల వెండి, 11లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Whatsapp Chatting : వాట్సప్ చాటింగ్‌పై భార్యకు భర్త మందలింపు.. ఫలితం రెండు చావులు
దోపిడీ చేసిన 24 గంటల్లోగా 11 లక్షలరూపాయలు మాయం చేయటంతో పోలీసుల ఆశ్చర్య పోయారు. వీరికి తెలిసిన వారు తిరుప్పూర్ లో ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. బీహార్ కు చెందిన నలుగురు యువకులను ఈరోజు నాగపూర్ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి తిరుప్పూర్ తరలించనున్నారు.